పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్యా పాండే హీరో హీరోయిన్స్ గా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన సినిమా లైగర్. ఈ సినిమా ఆగష్టు 15న రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సందర్భంగా ఇప్పటికే చిత్ర యూనిట్ దేశ వ్యాప్తంగా ప్రమోషన్ ముమ్మరం చేశారు. ఇప్పటికే పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ, అనన్య పాండే నార్త్ ఇండియాలో ఫుల్ ప్రమోషన్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేశారు. అక్కడ ప్రజల నుంచి కూడా విజయ్ కి మంచి పాజిటివ్ స్పందన వచ్చింది. విజయ్ దేవరకొండని సూపర్ స్టార్ అంటూ నార్త్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇదిలా ఉంటే తాజాగాగా తెలంగాణలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
పూరి జగన్నాథ్, ఛార్మి, నేను కలిసి ముంబై ని ఏలడానికి రెడీ అవుతున్నామని కామెంట్స్ చేశారు. ఈ స్టోరీలో కూడా తల్లి, కొడుకులు హైదరాబాద్ నుంచి ముంబైని ఏలడానికి వెళ్తారు. అలాగే మేము కూడా వెళ్తున్నామని విజయ్ దేవరకొండ కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్ ద్వారా నార్త్ ఇండియన్ సినిమాలని విజయ్ నేరుగా డైరెక్ట్ చేసినట్లు అయ్యింది. ఇప్పటికే నార్త్ లో సినిమాలు ఊహించని స్థాయిలో డిజాస్టర్ అవుతూ అక్కడి ప్రేక్షకులని నిరుత్సాహ పరుస్తున్నారు. మరో వైపు తెలుగు సినిమాలకి నార్త్ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.
ప్రస్తుతం బింబిసార సినిమా కూడా బాలీవుడ్ ప్రేక్షకులని బాగా ఆకర్షిస్తుంది. మరో వైపు కార్తికేయ 2 సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ సినిమాలని దాటుకొని పోతుంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా లైగర్ సినిమా మీద ఎక్కువ హోప్స్ పెట్టుకుంది. దీనికి కారణం పూరి అండ్ టీం దీనిని తెలుగు సినిమాలా కాకుండా హిందీ మూవీలానే ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. ఇక కరణ్ జోహార్ ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఈ నేపధ్యంలో బాలీవుడ్ ఇండస్ట్రీని ఈ సినిమా అయినా కాపాడాలని కోరుకుంటున్నారు.