అర్జున్ రెడ్డి
సక్సెస్ తో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా లో పాపులర్ అయ్యాడు. సినిమా ఒక్క తెలుగులోనే రిలీజ్ అయినా వివిధ భాషల్లో అర్జున్ రెడ్డి
రీమేక్ అవ్వడం విజయ్ కి బాగా కలిసొచ్చింది. ఆ ఒక్క హిట్ తో బాలీవుడ్ అనూహ్యమైన గుర్తింపును తెచ్చి పెట్టింది. సరిగ్గా ఇదే ఇమేజ్ ని ఎన్ క్యాష్ చేసుకునేందుకు పూరి రంగంలోకి దిగి లైగర్
చిత్రాన్ని తెలుగు.హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
విజయ్ తొలి బాలీవుడ్ చిత్రంతో హిందీలో లాంచ్ అవుతున్నాడు. పూరికి బాలీవుడ్ లో కొద్దో గొప్ప ఇమేజ్ ఉంది. అమితాబచ్చన్ తో తెరకెక్కించిన భుడ్డా..హోగా తెరా బాప్
…బిజినెస్ మెన్
లాంటి చిత్రాలతో పూరికి ఉత్తారిదిన కొంత ఇమేజ్ క్రియేట్ అయింది.
శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ ఓ చిత్రం కమిట్ అయ్యాడు. త్వరలోనే ఈసినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ భామ కియారా అద్వాని ని ఎంపిక చేసారు. మొదటిలో చిత్రాన్ని కేవలం తెలుగులోనే తెరకెక్కించాలని ప్లాన్ చేసినట్లు తెలిసింది. కానీ తాజాగా ఈ కాంబో పాన్ ఇండియా కేటగిరిలోనే సినిమా తెరకెక్కించాలని భావిస్తున్నారని సమాచారం.
తెలుగుతో పాటు ఏక కాలంలో హిందీలో కూడా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. మొత్తంగా చిత్రాన్ని పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ చేస్తే బాగుంటుందని పలు సన్నాహాకాల్లో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కియారాకి భారీగా పారితోషిక ఆఫర్ చేసి ప్రాజెక్ట్ లోకి దించినట్లు సమాచారం. అయితే శివ ఎంపిక చేసుకున్న స్క్రిప్ట్ ఎలాంటింది? అన్నది తెలియాల్సిన విషయం. గతంలో ఆయన లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ చిత్రాలే తెరకెక్కించి సక్సెస్ లు అందుకున్నారు. టక్ జగదీష్
మినహా నిన్ను కోరి
..మజిలీ
చిత్రాలు బ్లాక్ బస్టర్ అందుకున్నాయి. ఆ నమ్మకంతోనే విజయ్ అవకాశం ఇచ్చాడని తెలుస్తుంది. అయితే పాన్ ఇండియా చెయ్యాలి అనేది విజయ్ ఐడియాగానే వినిపిస్తోంది. లైగర్
పై ఉన్న ధీమాతోనే ముందొస్తు ప్లాన్ లో భాగంగా గా శివని పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం సిద్దం చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా శివ మార్క్ లవ్ స్టోరీ అనే ప్రచారం సాగుతోంది. లవ్ స్టోరీ అనేది యూనివర్శల్ కాబట్టి పాన్ ఇండియాకి కనెక్ట్ అయ్యేలా సబ్జెక్టు లో కొద్ది పాటి మార్పులు చేసి తెరకెక్కిస్తే అన్ని ప్రాంతాల ప్రేక్షకులు ఆదరిస్తారు అన్న నమ్మకంతో ముందుకు వెళుతున్నారనే సంకేతాలు అందుతున్నాయి. మరి అసలు కథ ఏంటన్నది? విషయం తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగితేగాని తెలియదు. ఈ మధ్యే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యయి. అతి త్వరలోనే సినిమా స్టార్ట్ కాబోతుందని సమాచారం.