Vijay Devarakonda : డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం ‘లైగర్’. బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాతోనే దక్షిణాదికి పరిచయం అవుతోంది. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో ఉంది. మరోవైపు ప్రచారం జోరందుకుంది. అంతకు ముందు 70 అడుగుల కటౌట్‌తో హాట్ టాపిక్‌గా సినిమా మారిపోయింది. ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ‘లైగర్’ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఓ వివాదానికి తెరలేపి సినిమా పేరును అందరి నోళ్లలో నానేలా చేశారు.
Vijay Devarakonda : స్పెషల్ వీడియో షేర్ చేసిన రమ్యకృష్ణ
అయితే ఈ ట్రైలర్ ఇప్పుడు నెట్టింట ఓ సెన్సేషన్. ట్రైలర్ రిలీజైన 24 గంటల్లోనే సునామీని సృష్టించింది. కేవలం 24 గంటల్లోనే 51 మిలియన్ల వ్యూస్, 1.5 మిలియన్ల లైక్స్‌తో ట్రైలర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతూ దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో మూవీలో విజయ్ దేవరకొండకి తల్లిగా నటించిన సీనియర్ నటి రమ్యకృష్ణ తమ సినిమా ట్రైలర్‌కు ఇంతటి సక్సెస్‌ని అందించిన సినీ ప్రియులందరికీ కృతజ్ఞతలు చెబుతూ ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. ఈ ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ వీడియోపై విజయ్ స్పందిస్తూ.. ‘అమ్మా.. మనం ఇండియాని షేక్ చేసినమ్’ అని రీ ట్వీట్ చేశాడు. అంతేకాదు, ‘లైగర్’ని అందరికీ చేరవేయడంలో నా పని ఇంకా పూర్తి కాలేదు.. ఇప్పుడే మొదలైంది’.. అని రాసుకొచ్చాడు. మొత్తానికి తాను చేసిన వ్యాఖ్యలపై చాలా పెద్ద చర్చే జరుగుతున్నా కూడా వాటన్నింటినీ పట్టించుకోకుండా విజయ్ ఫుల్ స్పీడ్‌లో దూసుకుపోవడం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి విజయ్ రీట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కాగా.. ఈ సినిమా జూన్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా అటు దర్శకుడు పూరికి.. ఇటు విజయ్‌కు మంచి సక్సెస్‌ను అందిస్తుందనే ఆశా భావంతో ఉన్నారు.
Ammaaa ❤️
Manam India shake chesinameyy.. ❤️ https://t.co/XPMOnupZrK— Vijay Deverakonda (@TheDeverakonda) July 22, 2022