రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోహీరోయిన్లుగా నటింస్తోన్న చిత్రం ‘లైగర్’. దాదాపు షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుపుకుంటోంది. ఇటీవల విజయ్, అనన్య పాండేలు ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్య్వూలో అనన్య, విజయ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. విజయ్ బెస్ట్ కో-స్టార్ అని కితాబు ఇచ్చింది. అయితే ‘సినిమాలో కనిపించేదాని కన్నా విజయం బయట చాలా డిఫరెంట్ గా ఉంటాడు. ఒక్కసారి అతడిని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. సినిమాల్లో అతడు చేసే పాత్రలన్ని ధైర్యవంతంగా ఉంటాయి.
కానీ బయటక మాత్రం విజయ్ చాలా బయటపడతాడు. సహజంగా విజయ్ పిరికివాడు’ అంటూ చెప్పకొచ్చింది అనన్య. కానీ విజయ్ మంచి సహానటుడని, ఒక కో-స్టార్ నుంచి ఎలాంటి కంఫర్ట్స్ ఉండాలనుకుంటామో అవన్ని విజయ్ దగ్గర ఉంటాయని చెప్పుకొచ్చింది.
దీంతో ప్రస్తుతం అనన్య కామెంట్స్ వైరల్ గా మారాయి. కాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లీగర్ సినిమా పాన్ ఇండియా మూవీని ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. 2022 అగష్టు 25 ప్రపంచ వ్యాప్తంగా లైగర్ విడుదల కాబోతుంది. ఈ మూవీలో ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం, వరల్డ్ మాజీ చాంపియన్ మైక్ టైసన్ కీలక పాత్రతో నటిస్తున్నారు.