విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో ఆగష్టు 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కి రెడీ అవుతుంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఫైటర్ గా కనిపించబోతున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే ఈ మూవీలో దేవరకొండకి జోడీగా నటిస్తుంది. హీరో తల్లిగా కీలక పాత్రలో రమ్యకృష్ణ కనిపించబోతుంది. ఆమె పాత్రకి సినిమాలో మంచి ప్రాధాన్యత ఉన్నట్లు తాజాగా రిలీజ్ అయినా టీజర్ బట్టి తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ని దర్శకుడు పూరి హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. రెగ్యులర్ సినిమాలకి భిన్నంగా ఉండేలా ఈ సారి కథ, కథనం విషయంలో చాలా శ్రద్ధగా దర్శకుడు వర్క్ చేసాడనే మాట వినిపిస్తుంది. నిజానికి పూరి జగన్నాథ్ సినిమాలు అన్ని ఒకే రకమైన కథలతో తెరకెక్కుతాయి. అయితే ఈ సినిమా విషయంలో కథ కొత్తగా ఉంటుందని ఇప్పటికే పూరి ఓ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. అయితే అది ఎంత వరకు అనేది సినిమా చూసేంత వరకు తెలియదు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ యాక్షన్ ఎపిసోడ్ ని సరికొత్తగా ఉండాలని పూరి డిసైడ్ అయ్యి ఏకంగా అమ్మాయిలతో ఫైట్ సీక్వెన్స్ పెట్టినట్లు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ 14 మంది అమ్మాయిలతో ఈ సినిమాలో ఒక ఫైట్ సీక్వెన్స్ చేస్తాడని తెలుస్తుంది. ఈ సీక్వెన్స్ సినిమాకి హైలైట్ గా ఉండబోతుంది అనే టాక్ వినిపిస్తుంది. మరి ఇది ఎంత వరకు ఆకట్టుకుంటుంది అనేది సినిమా రిలీజ్ వరకు వేచి చూడాలి.