రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం యంగ్ హీరోల్లో భారీ బడ్జెట్ చిత్రాలను చేస్తున్న హీరోగా విజయ్ దేవరకొండ ఉన్నాడు. అతని చేతిలో రెండు పాన్ ఇండియా మూవీలు ఉన్నాయి. ఇందులో ఒకటి సమంతతో కలిసి శివ నిర్మాణ దర్శకత్వంలో చేస్తున్న ఖుషి మూవీ కాగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయబోయే పోలీస్ కాప్ స్టోరీ ఒకటి. ఇందులో ఒకటి ప్రేమ కథ చిత్రం కాగా రెండోది యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతుంది. ఇక టాలీవుడ్ లో కాకుండా సౌత్ ఇండియాలోని స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న నటి రష్మిక మందన.
ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ కి జోడిగా యానిమల్ అనే సినిమాలో నటిస్తుంది. పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో ఈ మూవీ హిందీలో తెరకెక్కుతుంది. మరోవైపు తెలుగులో అల్లు అర్జున్ కి జోడిగా పుష్ప సీక్వెల్ లో రష్మిక మందన సందడి చేయబోతుంది. ఈ మూవీ షూటింగ్ రీసెంట్ గా విశాఖపట్నంలో మొదలైంది. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ఏదో నడుస్తుందని ప్రచారం టాలీవుడ్ లో జోరుగా వినిపిస్తుంది. వీరిద్దరూ కలిసి గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలలో నటించారు. అప్పటినుంచి ఇద్దరు మధ్య ప్రేమ కథ నడుస్తుందని ప్రచారం ఉంది.
అయితే చాలా సందర్భాల్లో వీరిద్దరూ ఆ గాసిప్స్ కి పుల్ స్టాప్ పెట్టిన కూడా మళ్లీ మళ్లీ వస్తూనే ఉన్నాయి. దీనికి కారణం ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ రష్మిక కలిసి మల్దీవులకు హాలిడే ట్రిప్ కోసం వెళ్లారు. అక్కడ ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తున్న చేస్తున్న ఫోటోలు షేర్ చేశారు. అయితే ఇద్దరం మంచి ఫ్రెండ్స్ కాబట్టి కలిసి వెళ్ళామని రష్మిక చెప్పుకొచ్చింది. తమ మధ్య మంచి స్నేహబంధం ఉందని క్లారిటీ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా వీరిద్దరూ దుబాయ్ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ తమ దుబాయ్ ట్రిప్ కు సంబంధించి ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
ఈ ట్రిప్ లో విజయ్ తో పాటు రష్మిక మందన కూడా ఉండగా ఆసక్తికరంగా మారింది. బయటికి వీరిద్దరూ స్నేహితులమని చెప్పుతున్న కూడా వీరు ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని ఈ వీడియో చూసిన తర్వాత నెటిజెన్లు కన్ఫర్మ్ చేసేస్తున్నారు. అయితే ప్రేమించుకున్న విషయాన్ని బయటకు చెబితే కెరియర్ పరంగా ఇబ్బంది అవుతుందని ఉద్దేశంతోనే రష్మిక మందన ఆగుతుందని మాట టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. ఏది ఏమైనా విజయ్ దేవరకొండ రష్మిక కావాలని మీడియాకి తమ ఇద్దరికి సంబంధించిన వీడియోలు ఫోటోలు లీక్ చేస్తూ బయటకు మాత్రం ఏమీ లేదని చెప్పడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.