Viral Video : తమిళ్ హీరో విజయ్, అందాల తార పూజా హెగ్డే కలిసి నటించిన ‘ది బీస్ట్’ చిత్రంలోని ‘అరబిక్ కుత్తు’ సాంగ్ యావత్ దేశాన్ని ఓ ఊపు ఊపింది. సాధారణ ప్రేక్షకులతోపాటు సెలబ్రిటీలు కూడా ఈ పాటకు రీల్స్ చేస్తూ నెట్టింట్లో ఈ పాట క్రేజ్‌ను ఆమాంతం పెంచేశారు. తాజాగా ఓ 70 ఏళ్ల వృద్ధుడు ఈ పాటకు వేసిన స్టెప్పులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈయన వేసిన స్టెప్పులు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
తాజాగా ఓ 70 ఏళ్ల వృద్ధుడు అరబిక్ కుత్తుకు సాంగ్‌కు స్టెప్పులేసిన వీడియోను శృతి వాసుదేవన్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ తన అకౌంట్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఈ వృద్ధుడు ఈ హిట్ సాంగ్‌కు తనదైన స్టెప్పులువేసి హుషారుగా కనిపించాడు. ఈయన డ్యాన్స్ వేస్తున్నప్పుడు వీళ్ల భార్య పక్కనే కుర్చీలో కూర్చొని తిలకించడం విశేషం. ఆమె ఇతగాడి స్టెప్పులకు ముసిముసి నవ్వులు నవ్వుతూ మురిసిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజెన్లు ఫన్నీ కామెంట్లు చేస్తూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.
కొంతమంది దంపతులు అంటే ఇలానే ఉండాలని, మరికొంతమంది తాతయ్య ఇంకా వయసవ్వలేదని ఇలా ఫన్నీ ఫన్నీగా కామెంట్ చేస్తూ ఈ వీడియోను వీక్షిస్తున్నారు. అంతేకాకుండా ఇంత వయసైనా కూడా ఈ దంపతులు ఇంత అన్యూన్యంగా ఉన్నారని మరికొంతమంది కామెంట్ చేయడం విశేషం.
Viral Video :
ఇప్పటికే అరెబిక్ కుత్తు సాంగ్‌కు చాలామంది రీల్స్ చేసి అదరగొడుతున్నారు. ఈ సాంగ్ యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించి రికార్డులు బద్దలగొడుతుంది. ఇప్పటికే ఈ పాట లిరికల్ వీడియో మరియు వీడియో సాంగ్‌లు యూట్యూబ్‌లో 800 మిలియన్ వ్యూస్ సాధించి మరిన్ని రికార్డుల బ్రేక్ చేయడానికి రెడీగా ఉంది.
View this post on Instagram