మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేర్ వీరయ్య సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి రోజు నుంచి అద్బుతమైన టాక్ తో పాజిటివ్ వైబ్ ని సొంతం చేసుకుంది. ఫ్యాన్స్ నుంచి సాధారణ ప్రేక్షకుల వరకు ప్రతి ఒక్కరికి ఈ సినిమా భాగా కనెక్ట్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి నుంచి ఎలాంటి అంశాలు అయితే ప్రేక్షకులు కోరుకుంటున్నారో అవన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయనే మాట ప్రేక్షకుల నుంచి వినిపించింది. రాజకీయాల నుంచి మళ్ళీ సినిమాలలోకి అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి నుంచి ఐదు సినిమాలు వచ్చాయి. అందులో వాల్తేర్ వీరయ్యకి ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. దీనికంటే ముందు వచ్చిన వాల్తేర్ వీరయ్య సినిమా హిట్ అయినా కూడా అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాలేదు.
ఇక ఆచార్య సినిమా అయితే మెగాస్టార్ కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా మారింది. దీంతో మెగాస్టార్ నుంచి ఫ్యాన్స్ పూనకాలు తెప్పించే పెర్ఫార్మెన్స్, ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. ఇక వాల్తేర్ వీరయ్య సినిమాలో అవన్నీ పుష్కలంగా ఉన్నాయి. మొదటి నుంచి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన దర్శకుడు బాబీ మెగాస్టార్ లో ఒకప్పటి ఫన్ ఎనర్జీని మళ్ళీ చూపించాడు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ తో విజిల్స్ వేయించాడు. తరువాత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా అద్బుతంగా తెరకెక్కించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు.
ఈ కారణంగానే పది రోజుల తర్వాత కూడా వాల్తేర్ వీరయ్యకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే 10 రోజుల్లో 200 కోట్ల మార్క్ ని అందుకుంది. మెగాస్టార్ కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇక ఇప్పటి వరకు మెగాస్టార్ నుంచి వచ్చిన సైరా, గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య సినిమాలు 150 కోట్ల గ్రాస్ ని దాటాయి. ఇక సైరా నరసింహారెడ్డి తర్వాత, 200 కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేసిన సినిమాగా వాల్తేర్ వీరయ్య నిలిచింది. ఇక లాంగ్ రన్ లో ఆ సినిమా కలెక్షన్స్ ని ఈ మూవీ బీట్ చేస్తుందని భావిస్తున్నారు. ఇక ఈ సినిమా ద్వారా ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ వారికి 25 కోట్ల ప్రాఫిట్ వచ్చినట్లు తెలుస్తుంది.