Rana Daggubati : టాలీవుడ్ హీరో కమ్ విలన్ రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాత, తండ్రి గొప్ప నిర్మాతలుగా పేరు తెచ్చుకుంటే.. రానా నటుడిగా అంతే మంచి పేరును సంపాదించుకున్నాడు. ఏ క్యారెక్టర్ అయినా సరే.. తన నటనతో అదరగొట్టేస్తాడు. హీరోగా సూపర్బ్ అనిపించాడు. అటు విలన్‌గా కూడా ఔరా అనిపించాడు. ‘బాహుబలి’ సినిమాలో విలన్‌గా రానా మెప్పించిన తీరుతో నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యాడు. ‘భీమ్లా నాయక్’ మూవీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కంటే కూడా రానాయే ఎక్కువగా హైలైట్ అయ్యాడు. క్యారెక్టర్ ఏదైన రానా మాత్రం ఆ పాత్రలో ఒదిగి పోతాడు. తన కోసమే ఆ క్యారెక్టర్ పుట్టిందన్నట్టుగా నటనతో మెప్పిస్తాడు.
సినిమాలే అంటే హోస్ట్‌గా కూడా రానా ది బెస్ట్ అనిపించాడు. రానా దగ్గుబాటి హోస్ట్‌గా వ్యవహరించిన షో ‘నెం.1 యారి’..ఏ రేంజ్‌లో దూసుకుపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో తో రానా హోస్ట్‌గా సెలబ్రిటీలను, సామాన్యులను అలరించారు. అంతేకాకుండా తన బాబాయి వెంకటేష్‌తో కలిసి రానా మొదటిసారి ఓ వెబ్ సిరీస్ సైతం చేశాడు. ‘రానా నాయుడు’అనే టైటిల్‌తో ఇది స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. గతంలో వెంకటేష్, రానా ఇద్దరు కలిసి ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలో ఓ పాటలో దగ్గుబాటి బాబాయి అబ్బాయి కలిసి నటించారు. ‘రానా నాయుడు’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ హిందీతో పాటు తెలుగు, తమిళంతోపాటు ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌లో వెంకటేష్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించారు.
Rana Daggubati : సోషల్ మీడియా వేదికగా షాక్ ఇచ్చిన రానా
ఇదిలా ఉండగా.. రానా తన అభిమానులకు సోషల్ మీడియా వేదికగా షాక్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు బాగా దగ్గరగా ఉండే రానా కొద్ది రోజుల పాటు సోషల్ మీడియాలో కనిపించనంటూ బాంబ్ పేల్చాడు. ప్రస్తుతం రానా రెండు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటూ బిజీ బిజీగా కాలం గడిపేస్తున్నాడు. ఈ క్రమంలోనే తనకు సమయం లేదో ఏమో కానీ కొద్ది రోజుల పాటు సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నట్టు వెల్లడించాడు. “వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇక ఇప్పుడు సోషల్ మీడియా నుంచి కాస్త విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటున్నా. సినిమాలతో కలుస్తా. బిగ్గర్.. బెటర్.. స్ట్రాంగర్’ అంటూ రానా ట్వీట్ చేశాడు.
— Rana Daggubati (@RanaDaggubati) August 5, 2022