Wedding : హార్దిక్ పాండ్యా, నటాషా లు ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఈ జంట అబు జానీ సందీప్ ఖోస్లా కస్టమ్-డిజైన్ చేసిన రీగల్ దుస్తులను వెడ్డింగ్ కి ఎంచుకున్నారు. హార్దిక్ ఆఫ్-వైట్ గోల్డ్ షేర్వానీని ధరించగా, నటాసా ఎరుపు, బంగారు వర్ణాల కలయికతో ఉన్న వివాహ లెహంగాలో దేవతలా కనిపించింది.

క్రికెటర్ హార్దిక్ పాండ్యా, డ్యాన్సర్ నటాషాల వివాహం ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరిగింది. ఈ జంట వారి రొమాంటిక్ వెడ్డింగ్ ను క్రిస్టియన్, హిందూ రెండు సంస్కృతి, సంప్రదాయాలని అనుసరించి జరుపుకున్నారు. తమ వెడ్డింగ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేశారు. రీసెంట్ గా వారు క్రిస్టియన్ వివాహ వేడుక నుండి చిత్రాలను విడుదల చేసి ఫ్యాన్స్ ను అలరించారు.

ఈ జంట రీసెంట్ గా రాయల్ హిందూ వేడుక నుండి ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది . ఫోటోలతో పాటు “ఇప్పటికీ, ఎప్పటికీ” అని క్యాప్షన్ జోడించారు. పోస్ట్‌లో హార్దిక్, నటాషా లు అబు జానీ, సందీప్ ఖోస్లా ఫ్యాషన్ లేబుల్ నుండి సాంప్రదాయక దుస్తులను ధరించారు. వారి వివాహ చిత్రాలను చూస్తూ నెటిజన్ లు ఖుషి చేసుకుంటున్నారు.

అబు జానీ సందీప్ ఖోస్లా తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ పేజీ లో హార్దిక్ ధరించిన షేర్వానీ గురించి వివరాలను వెల్లడించింది. “ఎ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్, హార్దిక్ పాండ్యా & నటాషా పాండ్యా, ఏ డ్రీమ్ ఇన్కస్టమ్ ఎంసెట్ బై #అబుజనీసందీప్‌ఖోస్లా అని కాప్షన్ ఇచ్చారు. బంగారు జర్దోజితో అద్భుతంగా చేతితో ఎంబ్రాయిడరీ చేయబడిన రాచరికమైన, ఆఫ్-వైట్ జామ్దానీ షేర్వానీలో, హార్దిక్ అద్భుతంగా కనిపించాడు. ఎరుపు, ఆకుపచ్చ పూసల జ్యువెల్లరి అతని రూపానికి మరింత గ్లామ్‌ను జోడించాయి.

అత్యంత దైవికంగా, ప్రకాశవంతంగా కనిపిస్తూ శృంగారాన్ని వెదజల్లే విలాసవంతమైన ఎంబ్రాయిడరీ తో వచ్చిన గోటా ఘాగ్రా, జాకెట్టు వేసుకుని నాటాషా వివాహ వేడుకలో దేవతలా మెరిసిపోయింది. ఎరుపు రంగులో ఉన్న అందమైన బాందిని దుపట్టాను దీనికి జోడించింది. ఆమె తన మెడలో చోకర్ నెక్లెస్, చెవులకు ఇయర్ రింగ్స్, నుదుటన పాపిట బిల్ల,చేతికి గాజులు, ఉంగరాలు, అలంకరించుకుని అద్భుతమైన అద్భుతంగా కనిపించింది.
పెళ్లి వేడుక కోసం నటాషా లెహంగా ధరించగా, ఆమె అనంతరం ప్రకాశవంతమైన ఎరుపు రంగు చీరను ధరించింది. ఆరు గజాలు విశాలమైన బంగారు పట్టీ అంచు, ఎంబ్రాయిడరీ పల్లు కలిగిన ఈ చీరలో చాలా అందంగా కనిపించింది. ఆమె భారీగా ఎంబ్రాయిడరీ చేసిన హాఫ్ స్లీవ్ గోల్డ్ బ్లౌజ్‌తో లుక్‌ను పూర్తి చేసింది.