Vijay Devarakonda : అప్పుడెప్పుడో పోర్న్ స్టార్, బాలీవుడ్ నటి సన్నీలియోన్ కేరళలోని కొచ్చిలో ఓ షాపు ఓపెనింగ్‌కి వెళితే అమ్మడిని చూడటానికి ఇసుకేస్తే రాలనంత మంది జనం వచ్చారు. అప్పట్లో అదో పెద్ద హాట్ టాపిక్. ఒక నటిని చూడటానికి ఇంత మంది జనం వస్తారా? అది కూడా పనులన్నీ వదులుకుని.. ఆ భాష, ఈ భాష అన్న తేడాలేకుండా అన్ని భాషల పత్రికలూ ఈ విషయాన్ని హైలైట్ చేశాయి. సరే.. ఆమె అంటే ఓ పోర్న్ స్టార్.. సహజంగానే ఆసక్తి ఉంటుందనుకున్నాం. కానీ ఒక టాలీవుడ్ స్టార్‌కి ఆ రేంజ్ క్రేజ్ కనిపిస్తే వావ్.. నిజంగానే వండర్గానే ఫీల్ అవుతాం కదా.. అది కూడా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో. కళ్లు మరింత పెద్దవైపోతాయ్. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా? మన విజయ్ దేవరకొండ.
Vijay Devarakonda : ఈ క్రేజ్ టాలీవుడ్‌కే పరిమితమనే భ్రమలో ఉన్నాం..
సాధారణంగా ఓ సినిమా విడుదలయ్యాక అది బ్లాక్ బస్టర్ హిట్ అయితే నటీనటులకు ప్రేక్షకుల్లో క్రేజ్ రావడం సర్వసాధారణం. కానీ, సినిమా విడుదలకు ముందే ఓ టాలీవుడ్ హీరోకు బాలీవుడ్ మార్కెట్లో ఉన్న క్రేజ్ చూస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. విజయ్ దేవరకొండకు ముంబయిలోని ఫాలోయింగ్ చూసి నోరెళ్లబెడుతున్నారు. నిజానికి ఇలాంటి క్రేజ్‌ను మన స్టార్ హీరోలెవరూ సంపాదించుకోలేదు. ‘అర్జున్‌రెడ్డి’తోనే ఒక్కసారిగా విజయ్ దేవరకొండ సెన్సేషనల్ హీరోగా మారిపోయాడు. ఆ సినిమా తర్వాత నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్న క్రేజ్ పూర్తిగా మారిపోయింది. అయితే ఈ క్రేజ్ టాలీవుడ్‌కే పరిమితమనే భ్రమలో నిన్న మొన్నటి వరకూ ఉన్నాం. కానీ సీన్ మారిపోయింది.
విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’. ఈ సినిమా ఆగస్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ‘లైగర్’ టీమ్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. ఇందులో భాగంగా విజయ్-అనన్య ఆదివారం సాయంత్రం ముంబయిలోని ఓ షాపింగ్‌మాల్‌కు వెళ్లారు. విజయ్ వస్తున్నాడని తెలుసుకొన్న అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు. ఒక్కసారిగా ఆ షాపింగ్ మాల్ జనసంద్రంలా మారిపోయింది. అభిమానుల మధ్య తోపులాట.. కొందరు అమ్మాయిలు స్పృహ తప్పి పడిపోవడం చకచకా జరిగిపోయింది. అభిమానుల్ని కంట్రోల్ చేయడం కోసం.. కార్యక్రమం ముగియకముందే విజయ్, అనన్యలను అక్కడి నుంచి పంపించేశారు. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఒక టాలీవుడ్ హీరోకి ముంబయిలో ఉన్న క్రేజ్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.