Hyper Aadi తెలుగు సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కేవలం హీరోగానే కాకుండా మంచి మనసున్న మనిషిగా పవన్‌ను అందరూ అభిమానిస్తుంటారు. అందుకేనేమో సినిమా షూటింగ్‌లకు, ఆడియో ఫంక్షన్లలో ఆయన్ను చూడటానికి ఎక్కడెక్కడినుంచో అభిమానులు తరలివెళ్తుంటారు.
పవర్ స్టార్‌ను అభిమానించే వారిలో కేవలం సాదారణ ప్రజలే కాకండా సెలబ్రెటీలు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన ప్రోత్సాహం, ఆయన వ్యక్తిత్వం నచ్చి ఎంతో మంది నటీనటులు పవర్ స్టార్ ఫ్యాన్ అయిపోయారు. పవర్ స్టార్ సినిమాలకు సంబంధించిన ఫంక్షన్లలో ఆయన్ను అభిమానించే వారు ప్రధానంగా మెరుస్తూ ఉంటారు. ప్రధానంగా నటుడు బండ్ల గణేష్, కమిడియన్ హైపర్ ఆది ఈ కోవకు చెందిన వారే. ఎందుకంటే ఏ సందర్భం వచ్చినా బండ్ల గణేష్ తాను పవర్ స్టార్‌కు పెద్ద ఫ్యాన్ అంటూ చెప్పుకుంటూనే ఉంటారు. ఆయనపై కవిత్వం కూడా రాస్తుంటారు.
ఇక హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా కామెడీ పండిస్తున్న ఆది ముందునుండీ పవన్ కు పెద్ద అభిమానిగానే ఉన్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారీ ఆయన్ను ఆరాదిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన నటించిన సినిమాల్లో కూడా హైపర్ ఆదికి పవన్ అవకాశం ఇచ్చారు. ఇక క్రిష్ డైరెక్షన్లో పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో సైతం ఆది నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పవన్ కల్యాణ్‌ను హైపర్ ఆది కలవడం దీనికి బలం చేకూరుస్తోంది.
హరిహర వీరమల్లు సినిమా వర్క్‌లో భాగంగా పవన్ కల్యాణ్‌ను కలిసినట్లు హైపర్ ఆది ఓ ఇంటర్వూలో చెప్పారు. అప్పుడే పవన్ కల్యాణ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకున్నట్లు చెప్పారు. సమాజానికి ఏదో సేవ చేయాలన్న తపన పవన్ కల్యాణ్‌లో ఉందన్నారు ఆది. అందుకే ఆయన సినిమాలు చేస్తూ వస్తున్న డబ్బులతో కౌలు రైతులకు సహాయం చేసేందుకు ఖర్చు చేస్తున్నారన్నారు. డబ్బు మనిషిని మార్చేస్తున్న నేటి సమాజంలో డబ్బులను పేదల కోసం ఖర్చు చేస్తున్న పవన్ కల్యాణ్ గొప్ప వ్యక్తి అన్నది ఆది మాటల్లో అర్థమైంది. అలాంటి మంచి వ్యక్తిని తాను అభిమానిస్తూనే ఉంటానని ఆది చెప్పుకొచ్చారు. మొత్తానికి పవన్ డైరెక్ట్‌గా కలిసిన తర్వాత హైపర్ ఆది పవన్‌కు మరింత పెద్ద ఫ్యాన్ అయ్యాడనడంలో సందేహమే లేదు.