Sudheer and Rashmi : సుధీర్, రష్మి పరిచయం అక్కర్లేని పేర్లు. ఇద్దరూ తెలియని తెలుగు ఆడియన్స్ ఉండరేమో. వీరిద్దరికీ మధ్య ఒక లవ్ ట్రాక్‌ను క్రియేట్ చేయడంలో మల్లెమాల సూపర్ సక్సెస్ అయ్యింది. వీరిద్దరి జంటకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో దాన్నే చాలా కాలం పాటు కంటిన్యూ చేశారు. ఫైనల్‌గా వారిద్దరూ తామొక మంచి ఫ్రెండ్స్ అని తేల్చి చెప్పేశారు.
జబర్దస్త్ నుంచి ఎవరైనా స్టార్ రేంజ్‌కు వెళ్లారంటే.. అది ఒక్క సుధీరే. సుడిగాలి సుధీర్‌గా పరిచయమైన ఈ యంగ్ మ్యాన్.. తన కామెడీ స్కిట్లలతో.. కామెడీ టైమింగ్‌తో.. ఎవరు తన మీద పంచులేసినా తీసుకునే నేచర్‌తో.. చాలా పాపులర్ అయ్యాడు సుధీర్. వీటన్నింటికి మించి రష్మితో లవ్ అనే టాపిక్‌తో నెట్టింట విపరీతంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. సుధీర్ స్కిట్‌కు మిలియన్లలో వ్యూస్.. యూత్‌లో అదిరిపోయే క్రేజ్. ఇక రష్మితో కెమెస్ట్రీ బాగా వర్కవుట్ అవడంతో వీరిద్దరూ కలిసి జోడీగా వేరే షోలు సైతం చేసి ఇంకా మంచి గుర్తింపు పొందారు. అంతేకాదు పండుగలకు పబ్బాలకు.. స్పెషల్ షోలకు, ఈవెంట్లకు వీరిద్దరే స్పెషల్ అట్రాక్షన్‌గా మారిపోయారు. వీరి కెమెస్ట్రీకి.. పాపులారిటీకి ఫిదా అయి కొన్ని స్పెషల్ స్కిట్లలో వీరికి పెళ్లి కూడా చేసేశారు. అసలు వీళ్లిద్దరి గురించి ఏ న్యూస్ వచ్చినా హాట్ టాపిక్ అయిపోతుంది.
Sudheer and Rashmi : సుధీర్ మాట్లాడిన మాటలను మ్యూట్ చేశారు..
అయితే సుధీర్ జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ ఆదివారం ప్రసారం అయ్యే శ్రీ దేవి డ్రామా కంపెనీ షో లో రష్మీ కి సుడిగాలి సుధీర్ ఒక వీడియో బైట్‌ని పంపాడు. ఈ వీడియో బైట్ లో సుధీర్ మాట్లాడిన మాటలను మ్యూట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో బైట్ హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఈ వీడియో బైట్‌లో ఏముంది? అనేది చర్చనీయాంశంగా మారింది. తాజాగా అందుతున్న సమాచారం సుడిగాలి సుధీర్ అభిమానులకు కాస్త ఊరట నిచ్చే న్యూసే అందులో ఉందని తెలుస్తోంది.అదేమిటి అంటే ఆయన అతి త్వరలోనే జబర్దస్త్ షో లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. దీనికి సంబంధించిన సమాచారాన్నే వీడియోలో పంచుకున్నాడని టాక్. సుధీర్‌కి ఉన్న క్రేజ్ రీత్యా మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ప్రత్యేకంగా మాటీవీతో పాటు ఈటీవీలోనూ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారని టాక్. మరి దీనిలో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.