చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారా చంద్రబాబు నాయుడు మధ్య దశాబ్దాలుగా ఆధిపత్య పోరు నడుస్తుంది. ఇంకా చెప్పాలంటే కాలేజీ రోజుల నుంచి వీరిద్దరి మధ్య రాజకీయ వైరం నడుస్తుంది. కాలేజీ రాజకీయాలలో మొదలైన వీరి వైరం ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. అయితే చంద్రబాబు నాయుడు కాలేజీ రాజకీయాలలో పెద్దిరెడ్డి మీద గెలవకపోయిన టీడీపీ అధినాయకుడుగా మారిపోయి ఏకంగా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఏపీని పరిపాలించే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం కేవలం మంత్రి మాత్రమే అవ్వగాలిగాడు. అయితే పెద్దిరెడ్డికి చంద్రబాబుతో పాటు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వర్గంతో కూడా మొదటి నుంచి వైరం ఉంది.
నల్లారి, పెద్దిరెడ్డి ఒకే పార్టీలో ఉన్నా కూడా అతని ఎదుగుదలని అడ్డుకునే ప్రయత్నం పెద్దిరెడ్డి చేసాడనే విషయాన్ని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు చెబుతున్న మాట. అలాగే తన తరువాత రాజకీయాలు మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు ఏపీకి ముఖ్యమంత్రి కావడం కూడా పెద్దిరెడ్డి ద్వేషానికి కారణం అని నల్లారి కిషోర్ అంటున్నారు. తాను ఎన్ని ప్రయత్నాలు చేసిన కూడా ముఖ్యమంత్రి అవ్వలేకపోయానని, అయితే చంద్రబాబు నాయుడు మాత్రం అయిపోయారనే బాధ ఇప్పటికి అతనికి ఉందని అందుకే ప్రతి సారి విషయం కక్కే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి అడ్డుపడిన వ్యక్తి పెద్దిరెడ్డి అని అన్నారు. రాజశేఖర్ రెడ్డిని ఏ రోజు అతను సపోర్ట్ చేయలేదని విమర్శించారు. అలాగే తన అన్న కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినపుడు కూడా మూడు నెలల్లో దించేస్తా అని కబుర్లు చెప్పాడని, అయితే ఏపీ చేయలేకపోయాడని అన్నారు. అలాగే చంద్రబాబుని కుప్పంలో ఓడిస్తా అని పెద్దిరెడ్డి చెప్పే కాకమ్మ కబుర్లు అక్కడి ప్రజలు నమ్మరని, పీలేరు, పుంగనూరులో మైనార్టీలని, బీసీ, ఎస్సీలని బెదిరించి గెలుస్తూ వస్తున్నాడని, కుప్పంలో అలాంటి కథలు నడవవని విమర్శించారు. మొత్తానికి పెద్ది రెడ్డికి చంద్రబాబు మీద ద్వేషానికి కారణం ముఖ్యమంత్రి కాలేకపోయాననే ఈర్ష్య అనే మాట కిషోర్ కుమార్ రెడ్డి చెబుతున్నారు.