మహేశ్ బాబు సతీసమేతంగా కూతురుతో కలిసి తాజాగా ఓ ఫంక్షన్ కి వెళ్లారు. అక్కడ మహేశ్ బాబు ఫ్రెండ్స్ తో సెల్ఫీలు దిగుతూ, పార్టీని మస్త్ ఎంజాయ్ చేసారు. ఈ ఫోటోలను మహేశ్, నమ్రత తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా ఈ ఫొటోల్లో మహేష్ చేసిన ఫోజులు హంగామా చూసి మన మహేశ్ ఏనా ఈ రేంజ్లో ఎంజాయ్ చేసింది అంటూ అభిమానులు, ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.
శ్రియా భూపాల్ సీమంతంలో మహేష్ బాబు ఫామిలీ సందడి చేసింది. మహేష్ తో పాటు ఆయన సతీమణి నమ్రత, కూతురు సితార ఈ సీమంత వేడుకకు హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
సోమవారం రాత్రి జరిగిన ఈ వేడుకలో మహేష్ అండ్ ఫ్యామిలీ ఎంజాయ్ చేశారు. స్నేహితులతో కలిసి సరదాగా ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోల్లో మహేష్ బాబు టీనేజ్ కుర్రాడిలా కనిపిస్తుండటం విశేషం.
వ్యాపారవేత్త అనిందిత్ రెడ్డితో జూలై 6, 2018లో శ్రియా భూపాల్ పెళ్లి జరిగింది. ఈ పెళ్లి వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అప్పట్లో ఈ పెళ్లి హాట్ టాపిక్. ఎందుకంటే అప్పటికే అక్కినేని అఖిల్ తో నిశ్చితార్థం చేసుకొని క్యాన్సిల్ చేసుకుంది శ్రియా భూపాల్.
మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ‘గుంటూరు కారం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. మిర్చి కంటే ఘాటుగా మహేష్ బాబును ఈ మూవీలో చుడనున్నాం అని టాక్