Monkey : మనుషులకే కాదు.. కోపతాపాలనేవి జంతువులకూ ఉంటాయి. అయితే అవి ఆయా సందర్భాన్ని బట్టి బయటపడుతూ ఉంటాయి. తాజాగా ఓ కోతి కోపానికి ఓ యువతి బలైంది. ప్రశాంతంగా ఉన్న జంతువులను రెచ్చగొడితే ఫలితం ఎలా ఉంటుందనడానికి ఈ వార్తే నిదర్శనం. మనుషులు చేసే చిన్న తప్పులకు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. సోషల్ మీడియా బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా కూడా అది తెలిసిపోతోంది. జంతువులను కవ్విస్తే అవి దాడి చేసిన వీడియోలు ఇప్పటికే చాలా చూసే ఉంటాము. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Monkey : సెకన్ల వ్యవధిలోనే తగిన మూల్యం చెల్లించుకుంది..
సాధారణంగా జూకు వెళ్తే కొన్ని నియమాలు పాటించడం తప్పనిసరి. వాటిలో ఒకటి.. కొన్ని జంతువులను దూరం నుంచి చూడటం. దీనికి సంబంధించిన హెచ్చరిక బోర్డులు అంతటా దర్శనమిస్తూనే ఉంటాయి. అయినా కొంత మంది పట్టించుకోరు. ఫోన్‌తో సెల్ఫీలు తీసుకోవడం.. వాటిని రెచ్చగొట్టడం వంటివి చేస్తుంటారు. దీంతో జంతువులు తిరగబడి గాయపరుస్తాయి. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడటం లేదా ప్రాణాలు సైతం పోయే పరిస్థితి కూడా రావచ్చు. తాజాగా ఓ యువతి.. బోనులో ఉన్న కోతిని రెచ్చిగొట్టింది. దీనికి సెకన్ల వ్యవధిలోనే తగిన మూల్యం చెల్లించుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో.. బోనులో ఉన్న కోతిని ఓ యువతి డిస్టర్బ్ చేస్తోంది. దీంతో కొండముచ్చు తీవ్ర ఆగ్రహంతో వెంటనే బోనులో జాలీ నుంచి తన చేతితో అమ్మాయి జుట్టును పట్టుకుంది. యువతి మొత్తుకున్నా జుట్టుని మాత్రం వదల్లేదు. కోతి చేతిలో నుంచి తన జుట్టును విడిపించుకోవడానికి అమ్మాయి ఎంతో శ్రమించింది. అయినా సరే వదల్లేదు. చివరకు పక్కనే ఉన్న కొంతమంది వచ్చి కోతిని భయపెట్టడంతో జట్టుని వదిలేసింది. దీంతో, ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.