వైసీపీ నాయకులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ఎక్కువగా చేసే విమర్శలు ఏంటి అనేది అందరికి తెలిసిందే. ఇక ఈ విమర్శలని తిప్పి కొట్టే అవకాశం గతంలో ఎప్పుడూ కూడా లోకేష్ కి రాలేదు. అయితే మొదటి సారి పాదయాత్ర ద్వారా నారా లోకేష్ ప్రజల్లోకి వచ్చాడు. పాదయాత్ర చేయడానికి సిద్ధం అయ్యాడు అంటేనే లోకేష్ మాటతీరు, ఆలోచన విధానం మారడంతో పాటు లీడర్ షిప్ క్వాలిటీస్ పెరిగాయని అర్ధం చేసుకోవచ్చు. ఇక టీడీపీ నాయకులు అందరూ కూడా ఈ విషయాన్ని ఇప్పటికే గుర్తించారు. చంద్రబాబు తర్వాత పార్టీని నడిపించే సామర్ధ్యం నారా లోకేష్ కి ఉందని నమ్ముతున్నారు. ఈ నేపధ్యంలోనే చంద్రబాబుని తమ ముఖ్యమంత్రిగా చూస్తూనే భవిష్యత్తు ముఖ్యమంత్రిగా లోకేష్ ని టీడీపీ నాయకులు చూస్తున్నారు.
దీంతో లోకేష్ కి దగ్గరయ్యేందుకు వారందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే నారా లోకేష్ పాదయాత్రని ముందుగా లెక్కచేయని వైసీపీ నేతలు, అధిష్టానం ఇప్పుడు ప్రతిరోజు దాని గురించే చర్చిస్తున్నారు. ముఖ్యంగా పాదయాత్రలో భాగంగా లోకేష్ అంశాల వారీగా తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి ఏం చేసాం. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా మోసం చేస్తున్నారు అనే విషయాలని లేవనెత్తి విమర్శలు చేస్తున్నారు. అయితే లోకేష్ లేవనెత్తే అంశాలకి వైసీపీ నాయకుల దగ్గర సరైన సమాదాలు లేవనే మాట ఇప్పుడు వారి విమర్శల తీరు చూస్తుంటే తెలుస్తుంది. ఈ నేపధ్యంలో ఎప్పటిలాగే వైసీపీ నాయకులు వ్యక్తిగత విమర్శలు చేసి కులాలని రెచ్చగొట్టడం మొదలు పెట్టారు.
అందులో భాగంగా కుప్పం మున్సిపల్ చైర్మన్ పై నారా లోకేష్ కొన్ని విమర్శలు చేశారు. కుప్పంలో పనులు గురించి మాట్లాడుతూ చైర్మన్ చేస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలని ఒక కులానికి ఆపాదించి మున్సిపల్ చైర్మన్ కులానికి చెందిన క్షత్రియ సామాజిక వర్గంలోని వైసీపీ నాయకులతో ప్రెస్ మీట్ లు పెట్టించి మా కులాన్ని అవమానిస్తావా అంటూ కొత్త వాణి అందుకున్నారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే పాలసీ విషయంపై లోకేష్ చేసిన విమర్శలని పక్కదారి పట్టించదానికి వైసీపీ అధిష్టానం ఈ రకంగా కులాన్ని దొషించాడు అంటూ విమర్శలు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
దీనిని బట్టి లోకేష్ పాదయాత్ర మున్ముందు కచ్చితంగా ప్రజలలోకి వెళ్ళే అవకాశం ఉందని వైసీపీ అధిష్టానం ముందే గ్రహించి ఎక్కడికక్కడ సంబంధం లేని అంశాలని తీసుకొని వాటితో కుల నాయకులని రెచ్చగొట్టి లోకేష్ పై విమర్శల దాడి చేయించడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. మరి వీటిని టీడీపీ పార్టీ ఏ విధంగా తిప్పి కొడుతుంది అనేది ఇప్పుడు చూడాలి.