ఏపీలో ఎన్నికలకు మరో 15 నెలల గడువుంది. అయితే ప్రధాన పార్టీలన్నీ కూడా ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అధికార పార్టీ ముందస్తుకే మొగ్గు చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వైసిపి ఎమ్మెల్యేలలో రోజురోజుకీ అధిష్టానంపై వ్యతిరేకత పెరుగుతుంది. పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా స్వరం వినిపించిన, ప్రశ్నించిన కూడా వారి పైన అధిష్టానం నిఘా పెడుతుందనే విషయం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.
ముఖ్యమంత్రి జగన్ ప్రతి ఒక్కరిని కూడా అనుమాన దృష్టితోనే చూస్తున్నారని విమర్శలు చేశారు. ఇంకా చాలామంది నాయకుల ఫోన్ లు కూడా టాపింగ్ జరిగినట్లుగా వారు చెప్తున్నారు. దీంతో వైసిపి ఎమ్మెల్యేలు గుబులు మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వైసీపీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టడానికి సిద్ధమవుతుంది. అలాగే వ్యతిరేకులను కూడా గుర్తించే పనుల్లో ఉంది. ఇక వైసిపి లో పెరిగిపోతున్న వ్యతిరేకత కారణంగా ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలామంది తెలుగుదేశం పార్టీ చూస్తున్నట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంటే కచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట.
అలాగే ప్రజలలో ముఖ్యమంత్రి జగన్ పాలనపై అంత సంతృప్తికరమైన అభిప్రాయం లేదని కూడా చాలామంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముందుగానే జగన్ కి గుడ్ బై చెప్పడంతో పాటు, వైసిపి పార్టీని వీలైనంతగా నష్టపరిచి టిడిపిలోకి వెళ్లాలని భావిస్తున్నారని టాక్. ఇప్పటికే దీనికి సంబంధించి చాలా మంది నాయకులు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా ప్రచారం నడుస్తుంది. వైసీపీలో ఉన్న వ్యతిరేకత మొత్తం కూడా టిడిపికి ఈసారి అనుకూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.
అయితే పార్టీలో వ్యతిరేకుల సంఖ్య పెరిగే కొద్దీ మరింతగా నష్టం జరుగుతుందని భావిస్తున్న అధిష్టానం ముందస్తు ఎన్నికల విషయంలో పునరాలోచనలో పడినట్లుగా రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తుంది. దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఓవైపు అధికార పార్టీలో పెరిగిపోతున్న వ్యతిరేకత, మరోవైపు జనసేనని వారాహియాత్ర, లోకేష్ పాదయాత్ర కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని భావిస్తున్న జగన్ రెడ్డి ముందస్తు వ్యూహాలకు తెరతీస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.