Kotamreddy: నెల్లూరులో వైసీపీకి పెద్ద ఇబ్బందికర పరిస్థితి తీసుకొచ్చిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఇప్పటికే వైసీపీ ప్రతీకార చర్యలు మొదలు పెట్టింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బట్టబయలు చేసి ఇతర ఎమ్మెల్యేల్లో భయాన్ని పెంచడంతో పాటు పార్టీపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాన్ని పంపించారని వైసీపీ ఆదిస్థానం భావిస్తుంది. పార్టీలో ఉంటూ పార్టీకి నష్టం కలిగించే చర్యలు కోటంరెడ్డి చేయడంతో జగన్ రెడ్డి అతనిపై చాలా అసహనంతో ఉన్నట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. దీంతో అధికారాన్ని ఉపయోగించుకొని ఎన్ని విధాలుగా కావాలంటే అన్ని విధాలుగా అతనిని ఇరికించే ప్రయత్నం చేయాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో అసలు పోటీ చేయడానికి కూడా వీలు లేకుండా చేయడానికి ఉన్న అన్ని మార్గాలని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.
ఇందులో భాగంగా ఇప్పటికే వైసీపీ కార్పొరేటర్ తో కోటంరెడ్డిపై కిడ్నాప్ కేసు పెట్టించారు. ఇంటికి వచ్చి, బెదిరించి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేసారని ఆరోపణలతో కార్పొరేటర్ తో కేసు పెట్టించడం గమనార్హం. మరో వైపు అతనికి ఉన్న సెక్యూరిటీని కూడా తగ్గించి 1+1కి పరిమితం చేశారు. వారిని కూడా నామమాత్రంగా ఉంచినట్లుగా తెలుస్తుంది. మరో వైపు కోటంరెడ్డిపై గతంలో ఎలాంటి కేసులు నమోధయ్యాయో చూసుకొని వాటిని తిరగాదోలె ప్రయత్నం కోడా మొదలు పెట్టినట్లుగా ప్రచారం నడుస్తుంది. అయితే కోటంరెడ్డి మాత్రం వైసీపీ అధిష్టానం వేధింపులకి అస్సలు తగ్గడం లేదు.
మీరు ఎన్ని కేసులు పెట్టుకున్న తాను భయపడేది లేదని చెబుతున్నారు. తాజాగా నెల్లూరు మేయర్ కూడా కోటంరెడ్డికి సపోర్ట్ గా మాట్లాడి, ఆయన వెంటనే తానూ ఉంటానని తెగేసి చెప్పింది. దీంతో ఆమెని మేయర్ పీఠం నుంచి తప్పించడానికి అధికార పార్టీ వైసీపీ రంగం సిద్ధం చేస్తున్నట్లుగా నెల్లూరు నగరంలో వినిపిస్తున్న మాట. మరో వైపు వైసీపీ ఎమ్మెల్యేలతో కోటంరెడ్డిపై ఎదురుదాడి చేయిస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని డైవర్ట్ చేసే విధంగా స్థానిక నాయకుల మధ్య వరంగా దానిని ప్రాజెక్ట్ చేసే ప్రయత్నం వైసీపీ సర్కార్ చేస్తుందనేది రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట.