అధికార పార్టీ వైసీపీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్తుంది. ప్రతిపక్షాల సౌండ్ వినబడకుండా చేయాలనే ఉద్దేశ్యంతో జగన్ రెడ్డి జీవోలని తీసుకొచ్చి వాటిని విపక్షాల మీద ప్రయోగిస్తున్నారు. అదే సమయంలో టీడీపీ చేసే అన్ని ఆందోళనలని కూడా తన కార్యకర్తలని ఉసిగొల్పి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రతిపక్షాల గొంతు నొక్కి ప్రభుత్వ వైఫ్యలాలని ప్రజలలోకి వెళ్ళకుండా ఆపాలని వైసీపీ అధిష్టానం ఈ రకమైన విధానాలతో ముందుకి వెళ్తుంది. అయితే సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు జగన్ రెడ్డి చేస్తున్న వ్యూహాత్మక ఎత్తుగడలని చాలా సులభంగా అర్ధం చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో జగన్ తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా లూప్ ని చూపించడంతో దానిని ప్రజలలోకి బలంగా తీసుకెళ్తున్నారు.
ప్రతి పక్షాలపై వైసీపీ పోలీసులని ఉపయోగించుకొని, అలాగే తమ పార్టీ కార్యకర్తలని ఉపయోగించుకొని చేస్తున్న దాడులని కూడా చంద్రబాబు నాయుడు తమకి అనుకూలంగా మార్చుకొని వైసీపీ విద్వంసకరమైన పాలన సాగిస్తుందనే విషయాన్ని ప్రజలలోకి తీసుకెళ్తున్నారు. ప్రశ్నించే వారిని జైల్లో పెట్టి, లేదంటే దాడులు చేసి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు చేయడం ద్వారా మరోసారి వైసీపీకి పట్టం కడితే కచ్చితంగా ప్రజలు భయపడుతూ బ్రతకాలనే విధంగా ఫోకస్ చేస్తున్నారు. దీనిని ప్రజలు కూడా బలంగా నమ్ముతున్నారు. ఈ నేపధ్యంలో ఏపీలో ఇది వరకు ఏ ముఖ్యమంత్రిపై లేనంత వ్యతిరేకత జగన్ పై ప్రజలలో ఉంది అనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.
సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకి డబ్బులు పంపిణీ చేస్తున్న ఆ అంశాలపై ప్రజలు దృష్టి పెట్టకుండా వ్యూహాత్మకంగా రాజకీయ సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజల ఫోకస్ అంతా తాము చెప్పే మాటలపై ఉండే విధంగా చంద్రబాబు చేస్తున్నారు. ఇలా జగన్ టీమ్ వేసే ఎత్తులకి చంద్రబాబు వేస్తున్న పై ఎత్తులకి వైసీపీ అధిష్టానం ఓ విధంగా కన్ఫ్యూజన్ లో పడుతుంది అనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.
ఆ అసహనాన్ని జగన్ తమ నాయకులపై పదే పదే చూపిస్తున్నారని, అలాగే నాయకులు కూడా దానిని భరించలేక బూతులతో పబ్లిక్ గానే టీడీపీపై విమర్శలు చేస్తున్నారు. వీటిని కూడా మీడియా ద్వారా ఎక్కువగా ఫోకస్ చేయడం ద్వారా పరిపాలన పక్కన పెట్టి ప్రతిపక్షాలపై బూతులతో దాడులు చేసి భయపెట్టాలని చూస్తున్నారు అంటూ చంద్రబాబు మరింతగా ప్రజలలోకి తీసుకెళ్తూ ఉండటం విశేషం.