పాదయాత్రతో నారా లోకేష్ జనంలోకి వచ్చారు. ఇక పాదయాత్రలో భాగంగా మొదటిరోజు బహిరంగ సభలో వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇక పాదయాత్రకి భారీ స్పందన వచ్చింది. రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. దీంతో సభ మొత్తం జనసందోహంతో నిండిపోయింది ఇక ఈ సభలో భాగంగా నారా లోకేష్ పైన విమర్శలు చేసిన అందరికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఒక మహిళ మంత్రి నన్ను గాజులు వేసుకొని తిరగమని సలహా ఇస్తుందని, అంటే గాజులు వేసుకున్న ఆడవాళ్ళు అంటే ఆమెకి అంత చులకన అంటూ రివర్స్ ఎటాక్ చేశారు. ఆ గాజులు నాకు పంపిస్తే మా అక్కాచెల్లెమ్మలకి ఇస్తానని అన్నారు. సైకో ముఖ్యమంత్రికి భయపడే రకం నేను కాదని, వారి తోలు ఒలిచే రకం అంటూ విమర్శించారు.
ఇక నారా లోకేష్ నుంచి వైసీపీ నాయకులు ఊహించని స్థాయిలో విమర్శల దాడి ఎదుర్కోవడంతో ఒకరితర్వాత ఒకరు వైసీపీ నాయకులు అందరూ మీడియా ముందుకి రావడం మొదలు పెట్టారు. అందరికంటే ముందుగా నేనున్నా అనుకుంటూ పేర్నినాని ప్రెస్ మీట్ పెట్టి మరీ ఒక గంట పాటు లోకేష్ ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. తరువాత కొడాలి నాని కూడా లోకేష్ పై విమర్శలు చేశారు. పార్టీని నందమూరి కుటుంబం నుంచి లాక్కోవడానికి లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు అని విమర్శించడం ద్వారా లోకేష్ బలాన్ని గుర్తించినట్లు అయ్యింది. ఇక అంబటి రాంబాబు కూడా మీడియా ముందుకి వచ్చి విమర్శలు మొదలు పెట్టారు.
తాజాగా రోజా కూడా విశాఖలో నారా లోకేష్ పై విమర్శలు చేసింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారనేది ప్రజలందరికి తెలుసనీ రోజా అన్నారు. లోకేష్ కి జగన్ ని విమర్శించే అర్హత లేదని దయ్యబట్టారు. ఇక పాదయాత్ర జరుగుతున్నని రోజులు లోకేష్ చేసే విమర్శలకి కౌంటర్స్ ఇవ్వాల్సిందే అని వైసీపీ అధిష్టానం ఎమ్మెల్యేలకి, మంత్రులకి అల్టిమేటం జారీ చేసిన నేపధ్యంలో వారి మాటల దాడి స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికి పాదయాత్ర వైసీపీ నేతల్లో గుబులు పుట్టిస్తుందని ఇప్పుడు వారి విమర్శల ద్వారా టీడీపీ నేతలు భావిస్తున్నారు. అదే విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నారు.