AP Capital: ఏపీలో అధికార పార్టీ వైసీపీ మూడు రాజధానులు అంటూ గత మూడేళ్ళుగా ప్రజల ని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. మూడు రాజధానులతో మూడు ప్రాంతాల అభివృద్ధి అంటూ తెగ ఊదరగొట్టారు. ఇక మూడు రాజధానులకి మద్దతుగా ర్యాలీలు కూడా నిర్వహించారు. అయితే గ్లోబల్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి జగన్ ఏపీకి విశాఖ రాజధాని కాబోతుంది అని చెప్పి కొత్త చర్చకి తెరతీసారు. అయితే దానిని మళ్ళీ మ్యానేజ్ చేయడానికి వైసీపీ మంత్రులతో పాటు సజ్జల రామకృష్ణా రెడ్డి వైసీపీ అజెండా మూడు రాజధానులు అని పేర్కొన్నారు. అయితే ఏపీ పరిపాలనా రాజధానిగా విశాఖ మారబోతుంది అనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి జగన్ అలా చెప్పారని సమర్ధించారు.

ఇక తాజాగా బెంగుళూరులో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా మూడు రాజధానులు అనేది మిస్ కమ్యూనికేషన్ వలన ప్రచారం అయ్యిందని చెప్పారు. ఏపీకి విశాఖపట్నం మాత్రమే సింగిల్ రాజధాని అంటూ చెప్పారు. అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వం ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందుతాయని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మరల బుగ్గన ఆ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే మళ్ళీ అవి ఎక్కడ రివర్స్ కోడతాయో అని భయపడిన వైసీపీ నేతలు వెంటనే మీడియా ముందుకి వచ్చి మూడు రాజధానులకి వైసీపీ కట్టుబడి ఉంది. ఆయన ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారనేది తర్వాత తెలుస్తుంది అని సమర్ధించారు.
వీరిలో ప్రభుత్వం సలహాదారు సజ్జల కూడా ఉన్నారు. ఇక వైసీపీ మంత్రులు ఒక్కొక్కరుగా బయటకి వచ్చి మూడు రాజధానులతో మూడు ప్రాంతాల అభివృద్ధి అనేది తమ అజెండా అని ఇందులో ఎలాంటి మార్పు లేదని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక బుగ్గన మాటలని మంత్రి అమర్నాథ్ మరో విధంగా సమర్ధించారు. ముఖ్యమంత్రి జగన్ విశాఖపట్నం నుంచి పరిపాలన చేస్తారని చెప్పడం తమ ఉద్దేశ్యం అని, అందులో భాగంగానే ఆ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. ఇందులో ప్రతిపక్షాలు విమర్శలు చేయాల్సినంత విషయం ఏమీ లేదని అన్నారు.