రోడ్ షోలు, పబ్లిక్ మీటింగ్ లపై ఆంక్షలు విధిస్తూ వైసీపీ సర్కార్ జీవో నెంబర్ 1ని అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ జీవోని అమల్లోకి తీసుకొచ్చిన ఏపీ సర్కార్ కచ్చితంగా ప్రతిపక్షాలు చేసే ప్రతి నిరసన కార్యక్రమాలకి, ఆందోళనలకి, ధర్నాలకి కచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలని పోలీసులకి ఆదేశాలు జరీ చేసింది. దీంతో పోలీసులు ప్రజలపై కూడా ఈ జీవో నెంబర్ 1ని ప్రయోగిస్తున్నారు. అస్సలు ఏ సమస్యతో కూడా ప్రజలు కాని, ప్రతిపక్షాలు కాని, ప్రజా సంఘాలు కాని రోడ్లపైకి వచ్చే అవకాశం అస్సలు ఇవ్వడం లేదు. రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు, నిరసనలు చేయాలంటే కచ్చితంగా పోలీసుల పర్మిషన్ తీసుకోవాలని చెబుతున్నారు.
అలాగే ప్రతిపక్షాలు చేసే ఇతర కార్యక్రమాలపై కూడా పోలీసులు ఈ జీవో నెంబర్ 1తో ఆంక్షలు పెడుతున్నారు. ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి జయంతి కార్యక్రమానికి పర్మిషన్ లేదని చెబుతూ పోలీసులు భూమా అఖిలప్రియని అడ్డుకున్నారు. అలాగే తాజాగా దళిత వ్యక్తిపై వైసీపీ నేత చేసిన దాడికి నిరసనగా ప్రతిపక్షాలు చలో కావలికి పిలుపునిస్తే దానిని కూడా పోలీసులు ఆంక్షలు ఉన్నాయని అడ్డుకోవడంతో పాటు టీడీపీ నేతలని హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే ఎక్కడా కూడా ప్రజలు కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన చేసే అవకాశం ఇవ్వడం లేదు.
అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమం కూడా జరగకుండా ఈ జీవో నెంబర్ 1తో పోలీసులు ఆంక్షలు విధిస్తూ అడ్డుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై ప్రతిపక్షాలు న్యాయసలహా తీసుకొని కోర్టుకి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. కందుకూరు, గుంటూరు సంఘటనలని ప్రభుత్వం బూచిగా చూపిస్తూ ఉండటంతో కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందనే దానిపై ఆలోచించి ధర్మాసనంని ఆశ్రయించాలని అనుకుంటున్నారు.