YCP vs Janasena: అధికార పార్టీ వైసీపీ రాన్నున్న ఎన్నికలని లక్ష్యంగా చేసుకొని ప్రజలలోకి విస్తృతంగా వెళ్ళడానికి వ్యూహాత్మకంగా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తుంది. మళ్ళీ అధికారంలోకి వచ్చి తమ బలాన్ని చూపించుకోవాలని భావిస్తుంది. దీనికోసం ఎమ్మెల్యేలని సమాయత్తం చేస్తుంది. గడపగడపకి మన ప్రభుత్వం పేరుతో ఇప్పటికే ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే ఇప్పుడు గ్రామ సారథులని సిద్ధం చేసి వారిని ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేసేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా మా నమ్మకం నువ్వే జగన్ అనే నినాదంతో స్టిక్కర్లు తాయారు చేసి వాటిని ప్రతి ఇంటికి అంటించాలని ఆదేశాలు జరీ చేశారు.
నాయకులు వెళ్ళిన ప్రతి గుమ్మానికి ఈ స్టిక్కర్ ఉండాలని చెప్పారు. ఇక ఈ స్టిక్కర్ చిన్నదే అయినా కచ్చితంగా ప్రజలలో ఎంతో కొంత ప్రభావింతం చేస్తుందని వైసీపీ అధిష్టానం భావిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా జనసేన మరో క్యాంపెయిన్ మొదలుపెట్టడానికి సిద్ధం అవుతుంది. మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్స్ ని వైసీపీ అతికిస్తే వాటి పక్కనే మాకు నమ్మకం లేదు దొర అంటూ ఒక సామాన్యుడు దండం పెడుతున్న స్తిక్కర్స్ ని తయారు చేసి అతికించాలని భావిస్తున్నారు.
దీని ద్వారా వైసీపీకి గట్టి దెబ్బ కొట్టాలని అనుకుంటున్నారు. అయితే జనసేన ఈ తరహా స్టిక్కర్లు అతికిస్తే వైసీపీ తన పవర్ ని ఉపయోగించుకొని అక్రమ కేసులు బనాయించే అవకాశం ఉందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. అయితే జనసేన పార్టీ నాయకులు మాత్రం తగ్గేది లే అంటూ వైసీపీకి కౌంటర్ గా తమ ప్రచారం కూడా చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. మరి జగన్ రెడ్డికి కౌంటర్ గా జనసేన చేపట్టబోయే ఈ కౌంటర్ స్టిక్కర్ పోలిటిక్స్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతాయనేది చూడాలి.