యువశక్తి వేదిగా కమెడియన్ హైపర్ ఆది వైసీపీ మంత్రులపై ఘాటుగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా మాట్లాడతూ అదే వేదికపై వైసీపీ మంత్రులని తనదైన శైలిలో హైపర్ ఆది కౌంటర్స్ తో విమర్శలు చేశాడు. ఇక ఈ మీటింగ్ తర్వాత హైపర్ ఆది చేసిన విమర్శల వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఇక పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ వ్యక్తిత్వ హననం చేసే వైసీపీ నాయకులు, సోషల్ మీడియా టీమ్ అందరూ కూడా హైపర్ ఆదిపై కూడా ఎదురుదాడి చేయడం మొదలు పెట్టారు. హైపర్ ఆది చేసిన విమర్శలకి సమాధానాలు చెప్పే ధైర్యం లేక నేరుగా అతనిపై కూడా వ్యక్తిగత దూషణలతో విమర్శలు చేయడం విశేషం.
ఈ నేపధ్యంలో హైపర్ ఆది జనసేన పార్టీ తరపున ప్రకాశం జిల్లాలో దర్శి, గిద్దలూరు నియోజకవర్గాలలో ఎక్కడో ఒక చోట పోటీ చేస్తాడనే టాక్ తెరపైకి వచ్చింది. ఈ నేపధ్యంలో హైపర్ ఆదిపై మరింత ఘాటుగా విమర్శలు చేయడం మొదలు పెట్టారు. డైపర్ ఆది ఆది అంటూ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అయితే అతనిపై దాడి చేశారు. దాంతో పాటు బైరెడ్డి సిద్దార్ద్ రెడ్డికి సంబందించిన సోషల్ మీడియా గ్రూప్ లో హైపర్ ఆది ఫోన్ నెంబర్ కూడా పెట్టి ఫోన్స్ చేయించి అతనిపై దాడి చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
హైపర్ ఆది మాటలు చాలా బలంగా ప్రజలల్లోకి బలంగా వెళ్ళాయి. ఈ నేపధ్యంలో ఆరంభంలోనే అతనికి ఫుల్ స్టాప్ పెడితే మరోసారి గట్టిగా మాట్లాడే చేయడని వైసీపీ అధిష్టానం భావించి సోషల్ మీడియాతో అతనిపై ఎటాక్ చేయడం మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. మొత్తానికి హైపర్ ఆది మాటలకి కూడా వైసీపీ భయపడటం మొదలుపెట్టిందని, అందుకే అతనిపై వ్యక్తిగత విమర్శలతో దాడి చేస్తున్నారని జనసైనికులు అంటున్నారు.