Bigboss Season 6 : చిన్న వయసులోనే హీరో భరత్ ఒకరకంగా టాలీవుడ్‌ను ఏలాడు. కామెడీకి ఈ చిచ్చరపిడుగు కేరాఫ్ అడ్రస్. బొద్దుగా ముద్దుగా ఉండే ఈ మాస్టర్‌కు టాలీవుడ్ చాలా అవకాశాలిచ్చింది. ఆ తరువాత భరత్ పెరిగి పెద్దవాడవడంతో అవకాశాలు క్రమేపీ తగ్గిపోయాయి. ఇటీవలి కాలంలో హీరోగా ఒకటి రెండు సినిమాల్లో నటించాడు. అవి కూడా ఈ యంగ్ హీరోకి ఆశించిన ఫలితాన్నివ్వకపోవడంతో ఇక అవకాశాలకు బ్రేక్ పడింది. అయితే ఈ యంగ్ హీరో త్వరలో బిగ్‌బాస్ సీజన్ 6లో సందడి చేయనున్నాడని టాక్. ఒకవైపు బయట అవకాశాల్లేకపోవడం.. మరోవైపు అడిగినంత డబ్బు ఇచ్చేందుకు బిగ్‌బాస్ నిర్వాహకులు సిద్ధంగా ఉండటంతో ఈ యంగ్ హీరో బిగ్‌బాస్ రియాలిటీ షోకి వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడని టాక్.
Bigboss Season 6 : షో ఎప్పుడు ప్రారంభమవుతుందనేది తెలిసేది అప్పుడే..
బిగ్‌బాస్ సీజన్ 6 త్వరలోనే ప్రారంభం కాబోతోందని సమాచారం. దీనికి సంబంధించిన ప్రోమో షూటింగ్ కూడా పూర్తైందని తెలుస్తోంది. నేడో రేపో ప్రోమో విడుదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రోమో విడుదలైతే కానీ ఏ రోజున ప్రారంభమవుతుందనేది తెలుస్తుంది. ఇక ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి పెద్ద ఎత్తున ప్రచారమే జరుగుతోంది. ఇప్పటికే యాంకర్ ఉదయభాను బిగ్‌బాస్‌లోకి అడుగు పెట్టబోతోందనే ప్రచారం జోరుగానే సాగుతోంది. అమ్మడికి కూడా బయట అవకాశాల్లేకపోవడంతో ఈ షోకి వచ్చేందుకు సిద్ధమైందని టాక్.
ఇక హోస్ట్‌గా ఈ సారి నాగార్జున చేయడం లేదని కూడా ఓ టాక్ నడుస్తోంది. గత మూడు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన నాగ్.. ఆరో సీజన్‌కు మాత్రం దూరంగా ఉంటున్నారట. అటు షూటింగ్స్.. ఇటు బిగ్‌బాస్‌ను బ్యాలెన్స్ చేయడం కష్టమని భావిస్తున్న నాగ్ ఈ సీజన్‌కు వరకూ దూరంగా ఉండాలని నిర్ణయించారట. మరి నాగ్ చేయకుంటే ఈ షో బాధ్యతలను భుజానికి ఎత్తుకునే హీరో ఎవరనే దానిపై సైతం చర్చ జోరుగానే సాగుతోంది. ఈ బిగ్‌బాస్‌కి సంబంధించిన వార్తలన్నీ నిజమో కాదో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.