YSRCP: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీలో అసంతృప్తులు పెరిగిపోతున్నారు. ఇప్పటికే నెల్లూరులో ముగ్గురు ఎమ్మెల్యేలు అధిష్టానంపై అసంతృప్తి స్వరం వినిపించడంతో వారి మీద వేటు వేసేవిధంగా వచ్చే ఎన్నికలలో అక్కడ ఇంకో అభ్యర్ధులని వైసీపీ అధిష్టానం సిద్ధం చేస్తుంది. అందులో భాగంగా ఎమ్మెల్యేగా పోటీ చేయబోయే అభ్యర్ధులని ఇన్ చార్జ్ లుగా నియమిస్తుంది. ఇలా వచ్చే ఎన్నికలలో ఏ నియోజకవర్గాలలో అయితే సిట్టింగ్ లని మార్చాలని జగన్ రెడ్డి అనుకుంటున్నారో ఆయా నియోజకవర్గాలలో కొత్తగా ఇన్ చార్జ్ చార్జ్ లని నియమించారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకి పొమ్మనకుండా పొగబెడుతున్నారని తెలుస్తుంది. దీంతో వైసీపీ అధిష్టానం అవలంబిస్తున్న ఈ విధానంతో కనీసం 60 నుంచి 70 మంది ఎమ్మెల్యేల వరకు జగన్ పై గుర్రుగా ఉన్నారని తెలుస్తుంది.
అయితే వీరిలో కొంతమంది ఇలా వైసీపీలో ఉండి అవమానాలు పడలేక, అలాగే టీడీపీలోకి వెళ్ళడానికి అవకాశం లేకపోవడంతో రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారు. అయితే మరికొంత మంది టీడీపీలోకి వెళ్లి అయితే ఎమ్మెల్యే, లేదంటే నామినేటెడ్ పదవులు దక్కించుకోవాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు గుంటూరు ఎంపీ లావు క్రిష్ణదేవరాయులుకి కూడా ముఖ్యమంత్రి జగన్ చెక్ పెట్టినట్లుగా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికలలో ఎంపీ కాదు కదా కనీసం ఎమ్మెల్యేగా కూడా అతనికి అవకాశం ఇచ్చే ఉద్దేశ్యం జగన్ ని లేనట్లు కనిపిస్తుంది. ఈ నేపధ్యంలోనే తాజాగా వినుకొండలో జరిగిన ముఖ్యమంత్రి సభలో ఎంపీ పాల్గొన్న కూడా చెక్కుల పంపిణీలో అతనిని కనీసం పిలవలేదు. అక్కడ ఓ వైపు మంత్రి రజని, మరో వైపు బల్లం బ్రహ్మనాయుడుని జగన్ పక్కన పెట్టుకొని చెక్కులు పంపిణీ చేశారు.
ఎంపీ స్టేజ్ మీదనే ఉన్న అతనికి ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో అవమానంగా భావించిన ఎంపీ సభ జరుగుతూ ఉండగానే వెళ్ళిపోయారని తెలుస్తుంది. పొమ్మనకుండా పొగబెట్టడానికి ముఖ్యమంత్రి జగన్ ఇలా అతన్ని అవమానించినట్లుగా ఎంపీ వర్గానికి చెందిన వారు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎంపీ కూడా తన కార్యకర్తలతో భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చించినట్లుతెలుస్తుంది. అయితే ఎంపీ లావు కృష్ణదేవరాయులుకి మంత్రి రజని, ఎమ్మెల్యే బొల్లం బ్రహ్మనాయుడుతో చాలా కాలంగా పొసగడం లేదు. దీంతో వారు ఎంపీపై తప్పుడు సమాచారం ముఖ్యమంత్రికి పంపించినట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. అదే సమయంలో ఎంపీ కూడా రెగ్యులర్ గా ముఖ్యమంత్రికి టచ్ లో ఉంటూ ప్రసన్న చేసుకోకపోవడం వలన ఇలా అతనిపై వేటు వేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.