Global Summit: గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ విశాఖ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ సమ్మిట్ ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. అలాగే దేశీయ కంపెనీలకి చెందిన సీఈవోలు, అధినేతలు కూడా వచ్చారు. మొత్తం 345 కంపెనీలు ఈ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పాల్గొని ఏకంగా 13.05 కోట్ల పెట్టుబడులు ఏపీలో పెట్టడానికి ఒప్పంధాలు చేసుకోవడం విశేషం. ఇక వీటిలో లక్ష కోట్ల పెట్టుబడుల నుంచి ఉండటం విశేషం. ఇక ఈ పెట్టుబడులకి సంబందించిన ఏంవోయూలు కూడా జరిగాయి. ఇక ఈ కంపెనీల పెట్టుబడుల ద్వారా ఏపీలో రానున్న రోజుల్లో ఏకంగా ఆరు లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది అని ప్రభుత్వం అంచనా వేస్తుంది.
ఇక పరోక్షంగా కూడా లక్షలాధి మందికి ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇక ఇన్ని రోజులు పరిశ్రమలు రావడం లేదు. పెట్టుబడులు ఎవరూ పెట్టడం లేదు అంటూ నానా యాగీ చేసిన ప్రతిపక్ష పార్టీలకి తాజాగా జరిగిన గ్లోబల్ సమ్మిట్ ఒప్పందాలు కచ్చితంగా షాక్ ఇచ్చాయని చెప్పాలి. రికార్డ్ స్థాయిలో జరిగిన ఈ ఒప్పందాల ద్వారా ఏపీలో వైసీపీ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగింది అనేది రాజకీయ వర్గాలలో వినిపించే మాట. ఇన్ని రోజులు ప్రజలలో ఈ పరిశ్రమల స్థాపన, అభివృద్ధి అనే విషయాలపై ప్రజలలో కొంత అసంతృప్తి ఉన్నా కూడా అది గ్లోబల్ సమ్మిట్ ద్వారా పూర్తిగా తొలగిపోయింది. వైఎస్ జగన్ విశాఖపట్నాన్ని ఫోకస్ చేసి కంపెనీలకి అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు మార్గం సుగుమం చేశారు. దీంతో సంక్షేమ పథకాలతో ప్రజలలో తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు పారిశ్రామిక వేత్తలని ఆకర్షించడంలో తనదైన బ్రాండ్ ని చూపించగలిగాడు అనే మాట వినిపిస్తుంది.