YS Jagan: అధికార పార్టీ వైసీపీ నాయకులలో ముఖ్యమంత్రి జగన్ రోజురోజుకి నమ్మకాన్ని పెంచుతున్నారు అని చెప్పాలి. ఆయన వచ్చేది అప్పుడప్పుడే అయినా కూడా పవర్ ఫుల్ స్పీచ్ తో ప్రజలకి చేరువ కావడంతో పాటు ప్రతిపక్ష పార్టీలకి కూడా చెమటలు పట్టిస్తున్నారు. ముఖ్యంగా ఆయన ప్రసంగంలో ప్రతి మాట ఒక బాణంలా ప్రతిపక్షాలకి సూటిగా తగులుతున్నాయి అనే టాక్ వినిపిస్తుంది. సంక్షేమ పథకాల ద్వారా తాము ప్రజలకి ఏ విధంగా లబ్ది చేకూరుస్తున్నాం అనేది లెక్కలతో సహా జగన్ చెబుతున్నారు. అలాగే గత ప్రభుత్వం హయాంలో ప్రజలకి ఏం చేసారు. వారికంటే గొప్పగా తాము ఏం చేస్తున్నాం అనేది చెబుతున్నారు. అలాగే ఈ మూడేళ్ళ కాలంగా ప్రజల కోసం వారి సంక్షేమం కోసం తాము ఎలాంటి నిర్ణయాలు తీసుకొని అమలు చేసాం అనేది కూడా చెప్పారు.

ఇక తాగాగా తెనాలిలో జరిగిన సభలో కూడా జగన్ పాయింట్ టూ పాయింట్ ప్రతి అంశం మీద కూడా చాలా స్పష్టంగా తన అభిప్రాయాలని తెలియజేశారు. రైతులకి వైసీపీ ప్రభుత్వం ఏ స్థాయిలో పెద్దపీట వేస్తుంది అనేది లెక్కలతో చెప్పి చూపించారు. ఇక ఈ సభలో భాగంగా ప్రతిపక్షాల మీద తీవ్ర విమర్శలు చేసిన ముఖ్యమంత్రి జగన్ వారి వైఖరిని ఎండగట్టారు. ప్రజలకి సంక్షేమ పథకాల ద్వారా మంచి చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని దొంగల టీమ్ అంతా దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబుకి మీడియా సపోర్ట్, దత్తపుత్రుడు సపోర్ట్ ఉందని, తనకి మీ అందరి మద్దతు ఉందని అన్నారు. దేవుడి దయ, మీ ఆశీర్వాదంతో మళ్ళీ అధికారంలోకి వస్తామనే బలమైన నమ్మకం తనకి ఉందని జగన్ అన్నారు. అందుకే తాను 175 నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నా అని, చంద్రబాబు నాయుడికి గాని, దత్తపుత్రుడుకి గాని తనలా 175 నియోజకవర్గాలలో పోటీ చేసే దమ్ముందా అంటూ చాలెంజ్ చేశారు. తన లక్ష్యం 175 నియోజకవర్గాలలో గెలవడమే అని చెప్పారు. మీకు నేను మంచి చేస్తున్నా అని నమ్మితే తనకి మీరందరూ సైనికులుగా మారాలని ప్రజలని జగన్ ఈ సందర్భంగా కోరారు.