ముఖ్యమంత్రి జగన్ రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. అకస్మాత్తుగా ఈ పర్యటన ఖరారు చేసుకొని ఢిల్లీ వెళ్ళడం వెనుక కారణం ఏమై ఉంటుందనే కోణంలో ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయి. రెండు రోజుల క్రితం వైఎస్ అవినాష్ రెడ్డిని వివేకానంద హత్య కేసు విచారణలో భాగంగా సీబీఐ నోటీసులు పంపించి విచారించింది. అయితే ఆ విచారణ ఒకరోజే జరిగింది. కాని వైఎస్ అవినాష్ రెడ్డి ప్రమేయాన్ని నిర్ధారించుకోవడానికి సీబీఐ అధికారులు ఈ విచారణ చేపట్టినట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. ఈ నేపధ్యంలో విచారణ సందర్భంగా వైసీపీ అభిమానులు, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అవినాష్ రెడ్డితో పాటే ఉండి ఎప్పటికప్పుడు వైఎస్ జగన్ కి అప్డేట్స్ ఇచ్చేవారని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట.
ఈ ఈ సందర్భంలో ఉన్నపళంగా జగన్ ఢిల్లీ టూర్ ఖరారు చేసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా 31న దేశ రాజధానిలో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరుకానున్నారు. ఢిల్లీ లీలా ప్యాలెస్ హోటల్ లో దౌత్యవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో జగన్ పాల్గొనబోతున్నారు. అయితే ఒక రోజు ముందుగానే ఢిల్లీ వెళ్లి అక్కడ కేంద్రంలోని పేదలని వైఎస్ జగన్ కలవబోతున్నట్లుతెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్రానికి సంబందించిన నిధుల గురించి వారిని అడుగుతారని వైసీపీ వర్గాలలో వినిపిస్తుంది.
అయితే దీని వెనుక వైఎస్ అవినాష్ రెడ్డి ని సేఫ్ చేయాలనే ఆలోచన ఉందనే మాట విపక్షాల ప్రస్తావిస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ వివేకానంద హత్య కేసు తుదిదశకి వచ్చింది. ఈ నేపధ్యంలో సీబీఐ మరోసారి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరిని విచారిస్తుంది. అయితే ఏ రోజైన సీబీఐ మీడియా ముందుకి వచ్చి హత్యకేసులో ఎవరున్నారు అనే విషయాలు చెప్పే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది. వివేకానంద హంతకులు ఎవరనేది సీబీఐకి తెలుసని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కూడా కామెంట్స్ చేశారు. దీనిని బట్టి ఆ కేసు వైఎస్ అవినాష్ రెడ్డి మీదకి రాకుండా జగన్ కేంద్రంలోని పెద్దలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. మరి ఇందులో వాస్తవం ఏంటి అనేది భవిష్యత్తులో తెలిసే ఛాన్స్ ఉంది.