YS Jagan: ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి కార్యాలయంలో కూర్చొని గ్రౌండ్ లెవల్ లో రాజకీయాలు ఎలా నడవాలి అనే విషయాలపై వ్యూహాలు రచిస్తున్నారు. తన టీమ్ తో ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతూ ప్రతిపక్షాల వ్యూహాలని దీటుగా ఎదుర్కొంటూ రాజకీయ క్షేత్రంలో ఎంత బలంగా వెళ్లి పనిచేయాలి అనే అంశాలపై ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు. అదే సమయంలో పార్టీలో ఎవరు అసంతృప్తులు అనేది గుర్తించే పనిలో ఉన్నారు. అలాగే తన పొలిటికల్ టీమ్ ఐ ప్యాక్ సేకరిస్తున్న నివేదిక ఆధారంగా ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది. ఏ ఎమ్మెల్యేపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉంది అనే కోణంలో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ మధ్య వరుసగా నియోజకవర్గ ఇన్ చార్జ్ లతో రాజకీయ చర్చలు జరుపుతున్నారు.
అలాగే ఎమ్మెల్యే అభ్యర్ధులని కూడా ఖరారు చేస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు గ్రామ సారథుల నియామకం కూడా ముగింపు దశకి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక వారిని గ్రామాలలో ప్రతి ఇంటికి పంపించి మా నమ్మకం నువ్వే జగన్ అన్న అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. గడపగడపకి మన ప్రభుత్వంలో ఎమ్మెల్యేల ప్రోగ్రస్ ఏ స్థాయిలో ఉందో కూడా చర్చించబోతున్నారు. దీనికి గాను ఈ నెల 13న అన్ని నియోజకవర్గాల నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడానికి ముఖ్యమంత్రి జగన్ సిద్ధమయ్యారు.. దీనికి సంబంధించి పార్టీ ముఖ్యనేతలతో ఇప్పటికే భేటీ అయినట్లుగా తెలుస్తుంది.

ఈ సమావేశంలో ఎన్నికల కార్యాచరణని జగన్ ప్రకటిస్తారనే మాట వినిపిస్తుంది. అలాగే ఎమ్మెల్యేల పనితీరుపై నేరుగా వారికి తెలియజేయాలని భావిస్తున్నారు. అసంతృప్తులని కూడా బుజ్జగించే పనిలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని సమాచారం. టికెట్ రాని వారికి ఏదో ఒక భరోసా ఇచ్చి పార్టీ మారకుండా ఆపాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20 నుంచి మా నమ్మకం నువ్వే జగనన్న అంటూ ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ ప్రతి ఇంటికి స్టిక్కర్ ని అతించాలని, ఈ బాద్యతని ఎమ్మెల్యే ప్రతిరోజు పర్యవేక్షించాలని చెప్పబోతున్నారు.
అలాగే ఎమ్మెల్యేలు కూడా ప్రచారంలో పాల్గొని స్తిక్కర్స్ అతికించే ప్రయత్నం చేయాలని బలంగా జగన్ చెప్పబోతున్నట్లుగా టాక్. వారికి పూర్తి స్థాయిలో ఎన్నికలకి సన్నద్ధం చేయడం,. గ్రామ సారథులకి, పంచాయతీ కన్వీనర్ లకి ప్రచార బాద్యతలు అప్పగించి వారిని రాజకీయ క్షేత్రంలోకి పంపించాలని అనుకుంటున్నారు. ఇక వీటికి వచ్చే స్పందన బట్టి ఏప్రిల్ నెల నుంచి ముఖ్యనత్రి జగన్ పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించడానికి సన్నద్ధం అవుతున్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఇవన్ని కూడా ముందస్తు ఎన్నికల వ్యూహంలో భాగంగానే వైసీపీ చేస్తున్నట్లు ప్రచారం నడుస్తుంది.