AP Politics: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీ వచ్చే ఎన్నికలలో ఎలా అయినా అధికారంలోకి రావాలని బలమైన వ్యూహాలతో వెళ్తుంది. అయితే అందులో భాగంగా ప్రతిపక్షాల వాయిస్ ముందుగా ప్రజలకి చేరువ కాకుండా చేస్తే ఆటోమేటిక్ గా మన వాయిస్ జనానికి రీచ్ అవుతుందనే ఐడియాతో వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తున్నారు. అయితే రాజకీయాలలో ఆయా పార్టీలు తీసుకునే విధానపరమైన నిర్ణయాలు, వ్యూహాలే ఆ పార్టీలకి ప్రజలికి దూరం కావడానికి కారణం అవుతాయి అని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. అయితే ఈ విషయంలో గత ఎన్నికలలో టీడీపీ అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలు ఆ పార్టీ ఓటమికి కారణం అయ్యాయి. ఇప్పుడు వైసీపీని కూడా రానున్న ఎన్నికలలో అతని విధానాలే ఓడిస్తాయి అనే మాట వినిపిస్తుంది.

దీనికి కారణం ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయిన ప్రజల మధ్య తిరిగే స్వేచ్చ ఉండాలి. ఉంటుంది కూడా అయితే వైసీపీ మాత్రం టీడీపీ, జనసేన పార్టీలని ప్రజల మద్య తిరగకుండా చేయాలని ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా జీవోలు తీసుకొచ్చి, సెక్షన్ 30 అంటూ అప్పటికప్పుడు అమల్లోకి తీసుకొచ్చి ప్రతిపక్ష నాయకుల పర్యటనలకి ఆటంకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇలా చేయడం ద్వారా ప్రజల ఆలోచన డైవర్ట్ అవుతుంది అని భావిస్తున్నారు. ప్రజలు అంతా ఆ గొడవ మీద దృష్టి పెడతారు. అలాగే ప్రతిపక్షాలు వారు చెప్పాలనుకున్న విషయాలని వదిలేసి అధికార పార్టీని విమర్శలు చేయడం స్టార్ట్ చేస్తాయి.
వీటిని ప్రజలకి చూపించి ప్రతిపక్షాలు అన్ని తనపైన ముప్పేట దాడి చేస్తున్నాయి అంటూ జగన్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ స్ట్రాటజీ కాస్తా ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా మారేలా ఉందని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. పిల్లిని అయిన అణచివేసే ప్రయత్నం చేస్తే పులిలా మారుతుంది అని, అప్పుడు ప్రజలు అందరూ ఆ పిల్లి మీద సింపతీ చూపిస్తారు అనే బేసిక్ థియరీని జగన్ వదిలేస్తున్నారు అంటూ విశ్లేషకులు చెబుతున్న మాట. మరి ముఖ్యమంత్రి జగన్ మాత్రం మున్ముందు ఇదే పంథాలో వెళ్తారా లేదంటే ప్రజా వ్యతిరేకతని దృష్టిలో ఉంచుకొని మార్చుకుంటారా అనేది చూడాలి.