YS Jagan: రానున్న ఎన్నికల నేపథ్యంలో మంత్రులు ఎమ్మెల్యేలు అందరు కూడా కచ్చితంగా ప్రజల్లోకి వెళ్లి సంక్షేమ పథకాలు మరింత చేరుగా తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఇప్పటికి పలు సమావేశాల ద్వారా తెలియజేసిన సంగతి తెలిసింది. అయితే మార్చి 18 నుంచి మరింతగా ప్రజలకు చేరువ అయ్యేందుకు వైయస్ జగన్ ఇప్పటికే కార్యచరణ సిద్ధం చేసిన సంగతి అందరికీ తెలుసు. గ్రామ సారధులను నియమించి వారిని ప్రతి ఇంటికి పంపించి సంక్షేమ పథకాలు గురించి వారికి వివరించాలని సూచించారు. అలాగే ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు గురించి, వైసిపి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమం గురించి తెలియజేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఎట్టి పరిస్థితుల్లో కూడా నాయకులందరూ కూడా రోడ్ల మీదకి వెళ్లి పనిచేయాల్సిందే అని అల్టిమేటం జారీ చేశారు. ప్రజల్లోకి వెళ్ళని వారి సమాచారం కూడా తనకి ఎప్పటికప్పుడు వస్తుందని, ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ముఖ్యంగా మంత్రులందరూ కూడా తమకు ఇచ్చిన బాధ్యతలను నిర్లక్ష్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎలాంటి నిర్లక్ష్యం ఉన్న కూడా మంత్రి పదవి నుంచి తొలగిస్తానని హెచ్చరించారు.
ప్రతిపక్షాలు చేస్తున్న విషప్రచారాన్ని తిప్పి కొట్టాలని కూడా ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అన్ని స్థానాలలో గెలిచి తీరాల్సిందే అని అన్నారు. ఎక్కడ ఓడిపోయిన కూడా దానికి బాధ్యులైన వారిని చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మొత్తానికి జగన్ ఈ సారి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరికీ చాలా సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపధ్యంలో త్వరలో కొంత మంది మంత్రి పదవులు పోవడం ఖాయం అనే మాట వినిపిస్తుంది.