YSRCP: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీ సంక్షేమమే అజెండాగా ప్రజలలోకి బలంగా వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. వ్యూహాత్మక నిర్ణయాలతో ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలని తిప్పికొడుతూ బలంగా తమ వాణిని ప్రజలకి చేరవేయడానికి గ్రామ సారథులని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియమించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఎమ్మెల్యేలకి, నియోజకవర్గ ఇన్ చార్జ్ లు అందరికి వారి తప్పొప్పులని చూపించి, వారి బలాన్ని తెలియజేసి ప్రజలకి చేరువ కావాలని సూచించారు. ఆ దిశగా ఇప్పుడు నాయకులు అందరూ పని చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ద్వారా ముఖ్యమంత్రి జగన్ భరోసా కల్పిస్తున్నారు.
ఆర్ధికంగా వారికి తోడ్పాటు అందిస్తున్నారు. దీనిపై ప్రజలలో కూడా మంచి అభిప్రాయం ఉంది. సంక్షేప పథకాలు అందుకుంటున్న ప్రజలు అందరూ కూడా మళ్ళీ వైసీపీకి పట్టం కట్టేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న సంక్షేప పథకాలపై ప్రజల దృష్టి మళ్ళించే కుట్రలో భాగంగా రోజుకొక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వైఎస్ వివేకానంద హత్యకేసులోఎంపీ అవినాష్ రెడ్డిని చేర్చుతూ తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు.
ఎల్లో మీడియా కూడా ప్రతిపక్షాల కుట్రలో భాగంగా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. అయితే దీనిని ముఖ్యమంత్రి జగన్ బలంగా ఎదుర్కొంటున్నారు. ప్రజా బలం తమకి ఉందని నమ్ముతున్నారు. అందుకే తమ పాలన, ప్రజల కోసం తాను చేస్తున్న సంక్షేమాన్ని చూసి ఓటు వేయాలని అడుగుతున్నారు. ఈ మాటలు ప్రజలకి బలంగా చేరువ అవుతున్నాయి. అయితే మరింతగా ప్రజలకి చేరువ కావడానికి తాను కూడా ప్రజా క్షేత్రంలోకి వెళ్ళడానికి ముఖ్యమంత్రి జగన్ సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఏ ఒక్క అవకాశం కూడా ప్రతిపక్షాలకి ఇవ్వకూడదు అంటూ ప్రజలకి మనం ఏం చేస్తున్నామో తెలియజేయడం ఒకటే పరిష్కారం అని నాయకులు అందరికి చెబుతూ ఉండటం విశేషం.