YSRCP: విశాఖ వేదిక గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ నేటి నుంచి జరగబోతుంది. ఈ సబ్మిట్ ద్వారా భారీగా పెట్టుబడును ఏపీ రాష్ట్రానికి తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్ వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. నాలుగు లక్షల కోట్ల ఒప్పందలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం ఈ పెట్టుబడీదారుల సదస్సులు గ్రాండ్ గా చూపించి పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ కున్న అనుకూల అంశాలను వైసీపీ ప్రభుత్వం వారి ముందు ఉంచే ప్రయత్నం చేయబోతుంది. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నం వైసిపి నేతలు పరిపాలన రాజధానిగా ఫోకస్ చేస్తూ బ్రాండ్ వ్యాల్యూ గ్రాండ్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ పెట్టుబడిదారుల సదస్సును లక్ష్యంగా చేసుకొని తెలుగుదేశం పార్టీ విమర్శలు చేయడం సంచలనంగా మారింది.
కనీసం రాజధాని ఎక్కడ అనేది చెప్పలేని వైసీపీ ప్రభుత్వం పెట్టుబడిదారులను ఎలా ఆకర్షిస్తుందని విమర్శిస్తున్నారు. నాలుగేళ్ల పాటు పరిశ్రమకు వేత్తలను వేధించిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ పేరుతో నాటకాలు ఆడుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు విమర్శలు చేశారు. మరోవైపు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం పెట్టుబడులు ఎలా తీసుకు రాగలుగుతుందని గంట శ్రీనివాసరావు విమర్శలు చేశారు.
అయితే తెదేపా కావాలని వ్యాపారులు విశాఖపట్నం వచ్చే సమయంలో ఇలా తమ మీడియా ద్వారా దుష్ప్రచారం మొదలుపెట్టిందని విమర్శలు వైసీపీ నేతల నుంచి వినిపిస్తున్నాయి.. రాష్ట్రం బాగుపడితే చూడలేని పరిస్థితిలో తెలుగుదేశం నాయకులు ఉన్నారని మంత్రి అమర్నాథ్, బుగ్గన రాజేంద్రనాథ్ లాంటివారు విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఎలాంటి విమర్శలు చేసిన కూడా గ్లోబల్ సమ్మిట్ ద్వారా కచ్చితంగా ఏపీకి భారీగా పెట్టుబడులు తీసుకువస్తామని వైసిపి నేతలు చాలా చేస్తున్నారు.