YSRCP: చంద్రబాబు ముఖ్యమంత్రిగా సుమారు 15 సంవత్సరాలు పాటు పరిపాలించారు. అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఒక ఆరేళ్లు మాత్రమే ఉన్నారు. అలాగే వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఈ ముగ్గురి పాలనలో ఉన్న ప్రధాన వ్యత్యాసం వర్షాలు. వైయస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ పరిపాలనలో ఉన్నప్పుడు రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడ్డాయి, పడుతున్నాయి కూడా. ఈ మూడేళ్ల కాలంలో ఎక్కడ కరువు మండలం అనేది లేదు. అన్నిచోట్ల పంటలు అద్భుతంగా పంటలు పండాయి. అలాగే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ముఖ్యమంత్రి జగన్ ఎవరు ఇవ్వనంత సపోర్ట్ ఇస్తున్నారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా తమ పంటలను అమ్ముకొని డబ్బులు తీసుకుని వెసులుబాటు కల్పిస్తున్నారు.
అలాగే రైతు భరోసా ద్వారా ప్రతి ఏడాది ఆర్థిక చేయూత అందిస్తున్నారు. జగన్ పాలన ఆరంభమైన తర్వాత వర్షాలు పుష్కలంగా పడటంతో నదులు పొంగిపొర్లుతున్నాయి. భూగర్భ జలాలు భారీగా కూడా పెరిగాయి. ఓ విధంగా సెంటిమెంటల్ గా ఇది ముఖ్యమంత్రి జగన్ కి అనుకూలించే అంశం అని చెప్పాలి. దీనిని వైసీపీ నాయకులు, ముఖ్యమంత్రి కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ చంద్రబాబు హయాంలో వర్షాలు పడడమే గగనమైన పరిస్థితి ఉందని, ప్రజలు కరువులతో అల్లాడిపోయారని గుర్తు చేస్తున్నారు.
అదే సమయంలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుణ దేవుడు కూడా కరుణించి అద్భుతంగా వర్షాలు కురిపించాడని చెబుతున్నారు. దీని ద్వారా చంద్రబాబు నాయుడు పై ఒక రకమైన బ్యాడ్ సెంటిమెంట్ ని ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్తున్నారు. మళ్లీ చంద్రబాబుకి అధికారాన్ని అప్పగిస్తే ఖచ్చితంగా ఏపీ కరువు రాష్ట్రంగా మారిపోతుందని గుర్తు చేస్తున్నారు. ఈ సెంటిమెంట్ వ్యూహం బలంగా పనిచేస్తే ఖచ్చితంగా రైతులనే వారు చంద్రబాబుకి ఓటు వేసేందుకు భయపడతారు. ఈ నేపథ్యంలో దీనిని ప్రజలకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం వైసీపీ శ్రేణులు చేస్తున్నాయి.