YSRCP: అధికార పార్టీ వైసీపీ ప్రతిపక్షాలను అదే పనిగా అణచివేసే ప్రయత్నాలు చేస్తుందని విమర్శలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు రోడ్ల మీదకి వచ్చి ప్రజలలోకి వెళ్లకుండా నిరోధించడానికి కావలసిన అన్ని అవకాశాలను అధికార పార్టీ ఉపయోగించుకుంటుంది. ఇప్పటికే జీవో నెంబర్ వన్ తో రోడ్ షోలపై ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే దీనిపై ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తుంది. ఇదిలా ఉంటే ఓవైపు నారా లోకేష్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. అయితే పాదయాత్రకు ఎక్కడికి అక్కడ పోలీసులతో అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. పాదయాత్రలో భాగంగా నిర్వహించే సభలకు ఆటంకం కలిగిస్తున్నారు.
పర్మిషన్ లేదని చెబుతూ టీడీపీ వాహనాలను కూడా సీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉభయ గోదావరి జిల్లాలో రాజకీయ పర్యటనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న రోడ్స్ బహిరంగ సభలను ఇప్పుడు వైసీపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉండడం గమనార్హం. తాజాగా అనపర్తిలో చంద్రబాబు సభకు పోలీసులు బ్రేక్ వేశారు. అనుమతులు లేవని చెబుతూ ప్రచార ర్యాలీని బహిరంగ సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లమిల్లి విమర్శలు చేశారు.
ఇప్పటికే దీనికి సంబంధించి పర్మిషన్ తీసుకున్న తర్వాత సడన్ గా అనుమతులు లేవని చెప్పడం చూస్తుంటే వైసీపీ కుట్రలో భాగం అని ఆయన విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు సభలకు వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక అధికార పార్టీ వైసీపీ ఇలా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తుందని ఘాటుగా విమర్శలు చేశారు. పోలీసులు ఆంక్షలు నడుమ చంద్రబాబు నాయుడు ర్యాలీ చేయడానికి సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరోసారి రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట.