Zee Sarigamapa Winner Sruthika : సుమారు 26 వారాలపాటు ప్రేక్షకులను సంగీత సాగరంలో ముంచేసి.. ఉర్రూతలూగించి ఎంతోమంది అద్భుతమైన సింగర్స్‌ని ప్రేక్షకులకు పరిచయం చేసి వారి అభిమానాన్ని చూరగొన్న ‘జీ సరిగమప – ది సింగింగ్ సూపర్ స్టార్స్’ కార్యక్రమం తాజాగా ముగిసింది. ఈ ఫినాలే ఆది నుంచి అదరగొట్టే ప్రదర్శనలతో హైదరాబాద్‌కి చెందిన శృతిక సముద్రాల (20) టైటిల్ విజేతగా నిలిచింది. అలాగే ఆమెకు గట్టి పోటీనిచ్చి వెంకట సుధాన్షు రన్నరప్‌గా నిలిచాడు. ప్రెస్టీజియస్ ‘జీ సరిగమప – ది సింగింగ్ సూపర్ స్టార్స్’ ట్రోఫీతో పాటు, శృతిక రూ. లక్ష నగదు, మారుతి సుజుకి వాగన్-ఆర్ కారుని బహుమానంగా అందుకుంది. ఇక రన్నరప్‌గా నిలిచిన వెంకట సుధాన్షు రూ. 5 లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నాడు.
విన్నర్ కావడానికి ముందే శ్రుతిక సముద్రాల పలు బహుమతులను గెలుచుకోవడం విశేషం. ఆరేళ్లకే సంగీతంలో అడుగు పెట్టిన శ్రుతిక సముద్రాల ‘జీ సరిగమప- ది సింగింగ్ సూపర్ స్టార్స్’ ఫినాలే కార్యక్రమంలో ‘ఏమాయె నా కవిత’, ‘మెరిసేటి పువ్వా’, ‘సంకురాత్రి కోడి’, ‘కొంచెం నీరు’, ‘ఆనతినీయరా’ వంటి పాటలతో అదరగొట్టింది. కాగా.. శ్రుతిక ఈ సందర్భంగా ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తను చిన్నప్పటి నుంచి దివంగత లెజెండరి గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, సింగర్స్ చిత్ర, సుశీల గారిని ఫాలో అయ్యానని, అయితే తన ఫేవరేట్ సింగర్స్ మాత్రం చిత్రమ్మ, శ్రేయా ఘోషల్ అని చెప్పింది.
Zee Sarigamapa Winner Sruthika : అవి చూసి నాకు షాకింగ్‌గా అనిపించింది..
ఇక తనకు వచ్చిన మెసేజ్‌లో ప్రపోజల్స్ కూడా వస్తుంటాయి కదా.. అలా మీకు ఏమైన వచ్చాయా? అని శ్రుతికను ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ‘‘ఏంటో కానీ నాకు ఎక్కువగా అక్క అక్క అనే వస్తున్నాయి. ఇప్పటివరకు ప్రపోజల్స్ అంటూ ఏమీ రాలేదు. నేను చూసిన మెసేజ్‌లో అన్ని అక్క అనే ఉన్నాయి. ‘వీ సపోర్ట్ యూ అక్క’ అని మెసేజ్ పెడుతున్నారు. అవి చూసి నాకు షాకింగ్‌గా అనిపించింది. ఎందుకంటే అందరూ నన్ను అంత పెద్దదాన్ని అనుకుంటున్నారా? ఏంటి.. అంత పెద్దదానిలా కనిపిస్తున్నానా? అని అనిపిస్తోంది’ అంటూ శ్రుతిక చెప్పుకొచ్చింది.