పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పనకు కృషి
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యా
సమానత్వం, సంక్షేమం, అభివృద్ధి వైసీపీ ద్యేయం
18 ఎమ్మెల్సీ స్థానాల్లో 14 వెనుకబడిన వర్గాలకు – జడ్పీ ఛైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్
వచ్చే మార్చి నెల 3,4 తేదీల్లో ఉత్తరాంధ్ర మణిహారమైన విశాఖ వేదికగా ఇండస్ట్రియల్ సమ్మిట్ జరగనుందని దీనిలో పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు రానున్నాయని జడ్పీ ఛైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నగరంలోని హోటల్ బ్లూ ఎర్త్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని సంక్షేమం, అభివృద్ధి రెండు వైసీపీ ప్రభుత్వంకు రెండు కళ్లు అని అన్నారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాకు ఒక వైద్య కళాశాల ఉండాలని జిల్లా ప్రజల చిరకాల వాంఛ, దీనికోసం జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వలను కోరుతున్నారు. కానీ నేటి వరకు గత పాలకులు ఎవరు ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు. సుదీర్ఘ పాదయాత్రలో ఈ ప్రాంత ప్రజలు వైద్యం పరంగా ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులను సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు వెళ్ళబుచ్చారు. ఆనాడు ఆయన నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ వెనుకబడిన విజయనగరం జిల్లా వాసులకు వైద్య కళాశాలను ప్రకటించి దానికి సంబంధించిన అన్ని రకాల అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేశారు. అలానే కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ హెల్త్ కమిషన్ నుంచి కూడా వైద్య కళాశాలకు సంబంధించిన అన్ని రకాల అనుమతులు మంజూరయ్యాయి దీనికి సంబంధించి నిర్ణీత సమయంలోపు నిర్మాణ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో భావిస్తుందని ఆయన తెలిపారు.
ఎందరో ముఖ్యమంత్రులు ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించిన వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పాటుపడలేదని గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీకాకుళంకు వైద్య కళాశాల విజయనగరంకు జేఎన్టీయూ యూనివర్సిటీ మంజూరు చేశారని ఆయన గుర్తుచేశారు. రాజశేఖర్ రెడ్డి హయంలో విజయనగరం జిల్లాలో పలు నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేసి జిల్లా వాసులకు త్రాగు సాగునీరు అందించారని తెలిపారు.
జిల్లా నుంచి కేంద్ర రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన గత నాయకులు కూడా జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచారని అలానే భోగాపురం ఎయిర్ పోర్ట్ కు సంబంధించి అన్ని అనుమతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేశాయని అలానే నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద నిధులను విడుదల చేసి వారు ఖాతాల్లో జమ చేయడం జరిగిందని అలానే భోగాపురం ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. సారిపల్లి ప్రాంత నిర్వసితులకు గత ప్రభుత్వాలు పునరావత ప్యాకేజీ మంజూరు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి నెరవేర్చలేదని కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వారికి పునరావస ప్యాకేజీను అందిస్తున్నామని తెలిపారు. భూములు అందించిన ప్రతి రైతుకు వైసీపీ ప్రభుత్వం రుణపడి ఉంటుందని వ్యాఖ్యానించారు.
జన్మభూమి కమిటీలతో ప్రజలను దోచుకుంటే వైసీపీ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధితో ప్రజారంజకా పాలనను అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
అలాగే నాడు నేడు ద్వారా రాష్ట్ర విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు వైసీపీ ప్రభుత్వం నాంది పలికిందన్నారు.
కమిషన్ల కోసం చంద్రబాబు అండ్ కో కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా మారి కార్పొరేట్ విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వ విద్యాను నాశనం చేశారు. రాష్ట్రంలో పేదరికాన్ని విద్యాతోనే నాశనం చేయగలమని వైసీపీ ప్రభుత్వం గట్టిగా నమ్ముతుందని తెలిపారు. చదువుకునే స్తోమత లేక 2019కి ముందు బాల కార్మికుల రాష్ట్రంలో అధికంగా ఉండగా నేడు వారందరిని పాఠశాలలకు వెళ్లేలా అన్నిరకాల సదుపాయాలను ఉచితంగా కల్పించి వారిని చదువుకునేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.
సీఎం జగన్ వినూత్న విధాన పరమైన నిర్ణయాల ద్వారా ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థ రూపాంతరం చెందిందని విద్యారంగంలో దాని పనితీరు పరంగా 2021లో ఆంధ్ర రాష్ట్రం దేశంలో 7వ స్థానానికి చేరుకుందని తెలిపారు. గత టీడీపీ హయాంలో, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పనితీరు ఆధారంగా గ్రేడింగ్ ఇండెక్స్‌లో దేశంలోనే 24వ ర్యాంక్‌తో ఆంధ్రప్రదేశ్ అధ్వాన్నంగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉందని తెలిపిందని ఆయన గుర్తు చేశారు.
నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్పు
నాడు-నేడు కింద పూర్వ ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను కూడా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని ఆయన గుర్తు చేశారు. దీనిలో భాగంగా మొదటి
దశలో రూ.3,700 కోట్లతో 15,715 పాఠశాలలను పునరుద్ధరించగా నాడు-నేడు రెండవ దశ కింద 16,911 ప్రత్యేక పాఠశాలలతో సహా 22,344 పాఠశాలలను రాష్ట్రంలో పునరుద్ధరించబడుతున్నాయని మొత్తంగా 44,512 పాఠశాలలు దీనిలో ఉన్నాయని ఆయన తెలిపారు.
వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆంధ్రాలో ప్రభుత్వ పాఠశాలల్లో పెద్దఎత్తున విద్యార్థుల నమోదులు జరుగుతున్నాయని ఇది నోటి మాట కాదని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయని పదహారోవ ‘వార్షిక విద్యా స్థితి నివేదిక (గ్రామీణ) 2021 నివేదిక ప్రకారం, ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు 2018లో 62శాతం ఉండగా అది నేడు 71శాతానికికి పెరిగిందని ఆంధ్రప్రదేశ్‌లో 2022-23 బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి రూ.30,134.36 కోట్లు కేటాయించిందని దీని వల్ల 94.56శాతం పాఠశాలల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాలు ఉన్నాయని అంతేకాకుండా సెకండరీ విద్యా వ్యవస్థలో 100% ఉపాధ్యాయులకు శిక్షణ కల్పించామని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వ పాఠశాలలకు మధ్య అంతరాన్ని తగ్గించడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.688 కోట్లతో 5,18,740 ట్యాబ్‌లను పంపిణీ చేసి బైజుస్ కాంటెంట్ తో అందిస్తుందని అంతేకాకుండా ప్రతి తరగతి గదిలో స్మార్ట్ టీవీలను అమర్చిందని వీటన్నింటిని ప్రతిపక్ష టీడీపీ చెయ్యాలని ఏనాడైనా ఆలోచించగలరా అని ప్రశ్నించారు.
సమానత్వమే ప్రభుత్వ ధ్యేయం
జగనన్న విదేశీ విద్యా దీవన కింద మొత్తం 213 మంది లబ్ధిదారులకు 19.95 కోట్లు నిధులను విడుదల చేసి విదేశాల్లో చదువుకోవడానికి స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ లో భాగంగా 2023కి గాను దరఖాస్తు చేసుకున్నా విద్యార్థులకు మొదటి విడతగా ఫిబ్రవరి 3న చెల్లించడం జరిగిందని అన్నారు.
విజయనగరం జిల్లా వంగర మండలంకు చెందిన టీడీపీ నాయకుడు శ్రీనివాసరావు కూతురుకి విదేశీ విద్యాదీవెన కింద 84 లక్షల రూపాయలు ప్రభుత్వం అందిచిందని మొదటి విడత కింద వారి అకౌంట్ లో రూ.13,99,154 జమ చేసిందని కుల,మత, రాజకీయ బేధాలు లేకుండా లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుది విభజించి పాలించు వైఖరని జన్మభూమి కమిటీల పేరుతో అవినీతిని ప్రోత్సాహించారని గుర్తు చేశారు.
18 ఎమ్మెల్సీ స్థానాల్లో 14 వెనుకబడిన వర్గాలకు కేటాయించి మరోసారి బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేసినందుకు జడ్పీ ఛైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.