Nityamenon : బొద్దుగుమ్మ నిత్య మేనన్ పెళ్ళి గురించి ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్న విషయం తెలిసిందే. అసలే హీరోయిన్ల పెళ్లి వార్తలను వండి వార్చడంలో చాలా ఆతృత ప్రదర్శించే సోషల్ మీడియా, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతం నిత్యమేనన్ను హైలైట్ చేశాయి. త్వరలో ఆమె పెళ్ళి చేసుకోబోతుందని.. మలయాళ నటుడితో ప్రేమలో ఉందని ప్రచారానికి మసాలా పూసి వండి వడ్డించాయి. ఈ నేపథ్యంలో ఇంతకముందు ఒకసారి స్పందించి అవన్నీ రూమర్స్ అని చెప్పిన నిత్య.. తాజాగా మరోసారి తన పెళ్లి వార్తలపై ఇన్స్టాగ్రామ్ ద్వారా పూర్తిగా క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు స్వయంగా నిత్యా ఓ వీడియో సందేశాన్ని షేర్ చేసింది.
Nityamenon : రోబోలా మెకానికల్‌గా ఉండటం నాకిష్టం లేదు..
ఆ వీడియోలో నిత్య మాట్లాడుతూ..’నా పెళ్లి గురించి ఇటీవల వచ్చిన వార్తలో ఎలాంటి నిజం లేదు. అదంతా కల్పించినదే’ అని మరోసారి స్పష్టం చేసంది. పెళ్లి గురించి ప్రస్తుతానికైతే ఎలాంటి ఆలోచన కానీ ప్రణాళిక కానీ లేదని తేల్చి చెప్పింది. ఎవరో ఒక వ్యక్తి ఊహించుకుని ఓ ఆర్టికల్ రాస్తే, ఎలాంటి ఆధారాల్లేకుండా ఆ వార్తను అందరూ ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. తన పెళ్లి పేరుతో సంతోషకరైన కథ అల్లారని నవ్వుతూ చెప్పి.. పుకార్లకు చెక్ పెట్టేసింది. ఈ క్రమంలోనే, తన సినిమాల గురించి మాట్లాడుతూ.. ‘రోబోలా మెకానికల్‌గా ఉండటం నాకు ఇష్టం ఉండదు. అందుకే, అప్పుడప్పుడు సినిమాలకు బ్రేక్ ఇస్తుంటాను. నేను నటించిన ఐదారు సినిమాలు త్వరలోనే విడుదలకాబోతున్నాయి. ప్రస్తుతం వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నాను’.. అని నిత్య తెలిపింది.
‘అలా మొదలైంది’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. కానీ స్టార్ డమ్‌ను మాత్రం సంపాదించుకోలేకపోయింది. మెయిన్ హీరోయిన్, సెకండ్ హీరోయిన్, గెస్ట్ పాత్రలతో పాటు ప్రతి పాత్రకు ఓకే చెబుతూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించింది. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో తన నటనతో మెప్పించింది. అయితే కొద్ది రోజులుగా.. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ స్టార్ హీరోను నిత్యా మేనన్ పెళ్లి చేసుకోబోతున్నారని.. గత కొన్నిరోజులుగా పలు వెబ్సైట్లు, సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో నిత్యాకు ప్రశ్న ఎదురవగా, అవన్నీ గాసిప్స్ అని చెప్పింది. ఇప్పుడు నేరుగా ఇలా వీడియోతో రూమర్స్‌కి ఫుల్స్టాప్ పెట్టేసింది.