షార్ట్ ఫిలిమ్స్ ద్వారా నటిగా ఫేమ్ లోకి వచ్చి తరువాత జబర్దస్త్, ఇతర రియాలిటీషోలతో గుర్తింపు తెచ్చుకున్న నటి, యాంకర్ విష్ణు ప్రియ. టాలీవుడ్ లో నటిగా సక్సెస్ కావాలని ఎదురుచూస్తున్న ఈ అమ్మడుకి బుల్లితెరపై మాత్రం మంచి గుర్తింపు ఉంది. రీసెంట్ గా వాంటెడ్ పండుగాడు అనే సినిమాలో గ్లామర్ తో అందాల ప్రదర్శన చేసిన సినిమా చెత్తగా ఉండటంతో ఈ బ్యూటీ అందం ఎవరికీ రీచ్ కాలేదు. అయితే ఈమెకి ఇన్స్టాగ్రామ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనికి కారణం రెగ్యులర్ గా ఆమె పోస్ట్ చేసే హాట్ ఫోటోలు. అందాల ప్రదర్శన చేస్తూ ఆమె చేసుకొని ఫోటో షూట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంటాయి.
ఇంస్టాగ్రామ్ లో కూడా వేల నుంచి లక్షల్లో ఆమె ఫోటోలని నెటిజన్లు వీక్షిస్తూ ఉంటారు. దీంతో ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ని కూడా విష్ణుప్రియ బాగానే పెంచుకుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ఈ మధ్యకాలంలో హౌస్ లోకి వెళ్లి వచ్చిన వారు. అలాగే బిగ్ బాస్ దృష్టి తమపై పడాలని కోరుకుంటున్నవారు కావాలని ఆ షోపై కామెంట్స్ చేస్తున్నారు. ఇంటర్వ్యూలలో యాంకర్ బిగ్ బాస్ గురించి అడగడం పనిలో పనిగా వారి అభిప్రాయాలని పంచుకోవడం జరుగుతుంది.
ఇందులో భాగంగా తాజాగా విష్ణుప్రియ బిగ్ బాస్ పై తన అభిప్రాయాన్ని చెప్పింది. తెలుగు బిగ్ బాస్ షోని అంతగా ఫాలో కానని చెప్పింది. అలాగే తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం వచ్చిన వెళ్లానని, అయితే హిందీలో ఆఫర్ వస్తే మాత్రం కచ్చితంగా వెళ్తానని చెప్పింది. దీనికి కారణం అక్కడ రెమ్యునరేషన్ ఎక్కువ దొరుకుతుందని, అలాగే ఇండియన్ వైడ్ గా పాపులారిటీ వస్తుందని కూడా చెప్పింది. ఇక ఈ సీజన్ లో తన ఫెవరెట్ కంటిస్టెంట్ అంటే నేహా చౌదరి అని చెప్పింది. బయటి నుంచి ఆమెకి తన సపోర్ట్ ఉంటుందని చెప్పింది.