Ananya Pandey : దీపావళి పండుగ వేళ తారలంతా కలర్ ఫుల్ అవుట్ ఫిట్స్‌తో కట్టింగ్స్ ఇస్తుంటే లైగర్ బ్యూటీ అనన్య పాండే బ్లాక్ డ్రెస్‌తో మెస్మరైజ్ చేస్తోంది. గ్లామరస్ క్వీన్ అనన్య పాండే ముంబైలో మనీష్ మల్హోత్రా నిర్వహించిన ప్రీ దివాలీ బ్యాష్‌లో అదిరిపోయే అవుట్‌ఫిట్ వేసుకుని అందరి చూపును తనవైపు తిప్పుకుంది. కాంటెంపొరరీ ఎత్నిక్ లుక్స్‌తో ఫ్యాషన్ ప్రియుల మనసు దోచేస్తోంది ఈ చిన్నది.
Ananya Pandey : మనీష్ మల్హోత్రా పార్టీ కంటే ముందే మెస్మరైజింగ్ లేటోస్ట్ అవుట్‌ఫిట్‌తో హాట్ ఫోటో షూట్ చేసి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది అనన్య పాండే . బ్లాక్ కలర్ షరారా సెట్‌తో చేసిన ఫోటో షూట్ పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ఇంటర్నెట్లో ట్రాఫిక్ జామ్ చేసింది. ఈ అవుట్ ఫిట్‌ను బాలీవుడ్ ఫేవరటేట్ డిజైనర్ మనీష్ మల్హోత్రానే డిజైన్ చేశాడు.
ప్లంగింగ్ నెక్లైన్ బ్రాలెట్ ఫీచర్స్‌తో వచ్చిన బ్లౌజ్ వేసుకుని దానికి మ్యాచింగ్‌గా ఫ్లేర్డ్ ప్యాంట్స్ ధరించింది అనన్య పాండే. బ్రాలెట్ పైన్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో డిజైన్ చేసిన లాంగ్ కేప్‌ను వేసుకుంది. ఈ ఫోటో షూట్లో కేప్ లుక్స్ కేకలా ఉన్నాయి. అవుట్‌ఫిట్‌కు ఇదే ఆకర్షణీయంగా నిలుస్తోంది.
ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన పిక్స్ కింద ది డ్రామా అని క్యాప్షన్‌ను జోడించింది. ఈ పిక్స్‌కు సెలబ్రిటీల నుంచి రిప్లైల వర్షం కురిసింది. యూ లుక్ లవ్లీ అని రియా కపూర్ కామెంట్ చేయగా, నవ్యా నందన్, మిగితా వారు ఏమోజీలను పోస్ట్ చేశారు.
ఈ అవుట్‌ఫిట్‌లో అనన్య ఓ రేంజ్లో తన ఎద అందాలను చూపించి కుర్రాళ్లను రెచ్చగొట్టింది. గ్లామరస్ లుక్స్‌తో పార్టీలో సందడి చేసింది.
అంతకు ముందు అనన్య ముంబైలో జరిగిన ఓ దిపావళి ప్రీ పార్టీలో ట్రెడిషనల్ అవుట్‌ఫిట్ లో కనిపించి ఫెస్టివ్ ఫ్యాషన్ ను ప్రమోట్ చేసింది. లైట్ ఆరేంజ్ కలర్లో ఎంబ్రాయిడరీ డిజైన్స్ తో వచ్చిన ఈ అవుట్‌ఫిట్‌లో ఎంతో హాట్ గా కనిపించింది ఈ భామ.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది అనన్య పాండే. ఎప్పటికప్పుడు తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ను ఖుషీ చేస్తుంటుంది. సినిమాలతో బిజీగా ఉన్నా ఫాలోవర్స్‌తో ఏదో రకంగా టచ్ లోనే ఉంటుంది ఈ బ్యూటీ. ఇక అనన్య పెట్టే పోస్ట్‌ల కోసం ఫాలోవర్స్ ప్రతి రోజు ఆశగా ఎదురుచూస్తుంటారు.