ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొంత మంది సైబర్ క్రిమినల్ యాక్టివిటీస్ కి పాల్పడటం ఎక్కువ అయిపోయింది. సెలబ్రిటీలని లక్ష్యంగా చేసుకొని వారి అకౌంట్స్ ని హ్యాక్ చేస్తూ తప్పుడు సందేశాలని పోస్ట్ చేయడం, లేదంటే ఫేక్ ఫోటోలని ఆ అకౌంట్స్ ద్వారా సర్క్యులేట్ చేయడం చేస్తూ ఉంటారు. కొంత మంది సెలబ్రిటీలు పేస్ బుక్ ప్రొఫైల్స్ వాడకుండా వదిలేస్తారు. వారి అప్డేట్స్ అన్ని కూడా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇస్తూ ఉంటారు. ఇలా వాడకుండా వదిలేసిన ప్రోఫైల్స్ ని లక్ష్యంగా చేసుకొని హ్యాక్ చేస్తూ ఉంటారు.
తాజాగా యాంకర్, యాక్టర్ విష్ణుప్రియ పేస్ బుక్ పేజీలో ఒక్కసారిగా న్యూడ్ ఫోటోలు సర్క్యులేట్ కావడం మొదలయ్యింది. దీంతో చాలా మంది నుంచి ఆమెకి మెసేజ్ లు వెళ్ళడంతో ఒక్కసారిగా అలెర్ట్ అయ్యి చెక్ చేసుకుంది. అందులో హీరోయిన్స్ మార్ఫింగ్ ఫోటోలు హల్చల్ చేయడం కనిపించింది. దీంతో వెంటనే అలెర్ట్ అయిన విష్ణుప్రియ తన పేస్ బుక్ పేజీ హ్యాక్ అయ్యిందని. దయచేసి అందరూ ఆ పేజీకి రిపోర్ట్ కొట్టాలని సూచించింది. చాలా రోజులుగా నా పేస్ బుక్ పేజీని నేను యూజ్ చేయడం లేదని విష్ణుప్రియ చెప్పింది.
దీనిని హ్యాక్ చేసి అసభ్యకరమైన ఫోటోలని పోస్ట్ చేస్తున్నారని, చాలా రోజుల నుంచి పేజీని డీయాక్టివేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్న కుదరడం లేదని విష్ణుప్రియ ఇన్స్టాగ్రామ్ లైవ్ లో పేర్కొంది. విష్ణుప్రియ పేస్ బుక్ పేజీని ఫాలో అవుతున్న వారు దానిని అన్ ఫాలో చేయడం స్టార్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఈ మధ్య వరుసగా హాట్ ఫోటోషూట్ లు చేస్తూ యద అందాలు కనిపించే విధంగా తనని తాను షోకేస్ చేసుకుంటుంది. హీరోయిన్ గా అవకాశాల కోసం నార్త్ ఇండియన్ భామల తరహాలోనే హాట్ ఫొటోలతో రెచ్చగొడుతుంది.