హీరోయిన్ రమ్యకృష్ణ అందరికీ సుపరిచితమే. రమ్యకృష్ణ తన మూవీ లతో ఫ్యాన్స్ ని కూడా బాగానే సంపాదించారు. సాధారణంగా హీరో హీరోయిన్ల కి లేదంటే తోటి నటులకి మధ్య గొడవలు వస్తూనే ఉంటాయి. అప్పట్లో జయప్రద, శ్రీదేవి మధ్య ఏదో శత్రుత్వం ఉండేదని టాక్ ఉంది . విజయనిర్మల వాణిశ్రీ మధ్య కూడా శత్రుత్వం ఉండేదట. ఇలా కొంతమంది నటులకి సాటి నటులతో పడేది కాదు. అలానే రమ్యకృష్ణ కి కూడా ఇండస్ట్రీలో కూడా ఒక పెద్ద శత్రువు ఉన్నారు.
ఆమె కూడా పెద్ద హీరోయినే. ఆమె ఎవరో కాదు మీన. రమ్యకృష్ణ కి మీనా కి మధ్య శత్రుత్వం ఉండేది. వీళ్ళ కాంబినేషన్లో మూవీ అంటే చాలు దర్శక నిర్మాతలు భయపడిపోయేవారు. వాళ్ళిద్దరి మధ్య ఏ గొడవ వస్తుందని కంగారు పడేవారు. అయితే వీళ్ళ కాంబినేషన్లో పెద్దగా సినిమాలు ఏమీ రాలేదు. రమ్యకృష్ణ మీనా మధ్య ఎందుకు గొడవ ఉండేదో తెలియదు కానీ కొన్ని విషయాల్లో ఈగోలకి వెళ్లే వారు . దాంతో ఇద్దరూ కలిసి సినిమాలు కూడా పెద్దగా చేయలేదు. ఇద్దరూ కూడా మంచి ఫామ్ లో ఉన్న నటులే. సినిమాలు విషయంలో చాలా సార్లు వీళ్ళకి పోటీ వచ్చేది. అందుకే వీళ్ళ మధ్య గొడవలు వచ్చి ఉన్నట్టు తెలుస్తోంది.