బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్. ఆ తర్వాత మరొక హిట్ ను ఖాతాలో వేసుకోలేకపోయాడు. రీసెంట్ గా వచ్చిన ఆదిపురుష్ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయినాసరే ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా హీరో ప్రభాస్ పై `ది కశ్మీర్ ఫైల్స్` మూవీ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ప్రభాస్ కు యాక్టింగే రాదని.. అతను స్టార్ హీరో ఏంటి.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఎవరూ హింసని కోరుకుని పుట్టరు. ఇండస్ట్రీ పెద్దలు యువతను శాంతివైపు ప్రేరేపించేలా నడుచుకోవాలి.
కానీ మూవీస్లో , పాలిటిక్స్ లో హింసని ఒక ఫ్యాషన్ గా చూపిస్తున్నారు అని . ఇలాంటి హింసాత్మక ప్రపంచంలో సృజనాత్మక స్పృహ మాత్రమే పరిష్కారం అని అయన పేర్కొన్నారు.
అసలు నటనే రాని వ్యక్తిని బిగ్గెస్ట్ స్టార్ గా ప్రమోట్ చేయడాన్ని అతిపెద్ద టాలెంట్ గా పరిగణిస్తున్నారు.` అని వివేక్ అగ్నిహోత్రి తన ట్వీట్ లో పేర్కొన్నాడు.‘సలార్’ టీజర్లో వయులెన్స్ ఎక్కువగానే చూపించారు. ఏ తీశారు పై వివేక్ అగ్నిహోత్రి పరోక్షంగా సెటైర్లు వేశారు . పైగా ప్రభాస్ కు నటన రాదందూ విమర్శించారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ సదరు డైరెక్టర్ పై మండిపడుతున్నారు