టాలీవుడ్ అండ్ బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ ఆదాశర్మ తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా పరిచయమనే చెప్పాలి. హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ మూవీలో తన నటనతో బాగా ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత పలు సినిమాల్లో అవకాశాలు అందుకుంది. తెలుగులోనే కాదు.. హిందీ, కన్నడ, తమిళ భాషల్లో కూడా తన నటనను పరిచయం చేసింది ఈ ముద్దుగుమ్మ. మొదటిసారిగా 2008లో హారర్ మూవీతో బాలీవుడ్ పరిశ్రమకు పరిచయమైంది. ఈ సినిమాతో అద్భుతమైన నటన కనబరిచి ఉత్తమ నటి అవార్డు కూడా అందుకుంది.
ఇక ఆ తరువాత 2014లో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ మూవీతో తొలిసారి పరిచయమైంది. ఇక ఆ తరువాత పలు సినిమాల్లో అవకాశాలు అందుకున్న కూడా అంత గుర్తింపు తెచ్చుకోలేకపోయింది ఈ బ్యూటీ. కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ కూడా అంతగా సక్సెస్ కాలేకపోయింది. అక్కడి నుంచి మళ్లీ బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ప్రస్తుతం ఇతర భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బాగా బిజీగా మారింది. ఆదాశర్మ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. బుల్లితెరపై కూడా పలు వాణిజ్యపరమైన ప్రకటనలు కూడా చేసింది. ఇక సోషల్ మీడియాలో తనకు సంబంధించిన హాట్ ఫొటోలను, వీడియోలను అభిమానులతో బాగా షేర్ చేసుకుంటుంది. తన డ్యాన్స్ వీడియోలతో బాగా సందడి చేస్తుంది. తన హాట్ అందాలతో ఫొటో షూట్ చేయించుకుంటూ వాటిని బాగా షేర్ చేసుకుంటుంది.
నిత్యం ట్రెండీని ఫాలో అవుతుంటుంది. ఈమె మూగజీవుల పట్ల బాగా ప్రేమ చూపిస్తూ ఉంటుంది. వాటితో సమయం సస్పెండ్ చేసిన ఫొటోలు.. వీడియోస్ బాగా పంచుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు ఘోస్ట్ సంబంధించిన పిక్చర్స్ కూడా అందరికీ దడ పుట్టిస్తుంది. అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో కూడా ముచ్చట్లు పెడుతుంటుంది. చాలా ఆసక్తిగా ప్రశ్నలు వేస్తూ అందరినీ తికమక చేస్తుంటుంది. ఇక రీసెంట్ గా తను నటించిన ది కేరళ స్టోరీ తనకు మంచి సక్సెస్ అందించింది. ఇదంతా పక్కన పెడితే తాజాగా తను కొన్ని ఫొటోలను పంచుకుంది. అందులో తను వేసుకున్న షర్ట్, తన వెనుకాల ఉన్న వాల్ రెండు ఒకేవిధంగా ఉన్నాయి. వాల్ ఫస్ట్ ఆ తన షర్ట్ ఫస్టా అని అడిగింది. దీంతో ఒక్కొక్కరూ ఒక్కొక్కరూ లాగా సమాధానం చెబుతూ కనిపించారు. ఓ నెటిజన్ ఎలాంటి అబ్బాయి కావాలి అని ప్రశ్నించడంతో వెంటనే ఆదాశర్మ. నాలుగు కాళ్లు ఒక తోక ఉంటే బాగుంటుంది అని అదిరిపోయే సమాధానం ఇచ్చింది. సమాధానం చూసి జనాలందరూ తెగ నవ్వుకుంటున్నారని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.