Anjali Arora : షార్ట్ వీడియోస్ చేసి సోషల్ మీడియాను ఓ ఊపు ఊపి.. స్టార్లు అయిన వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో అంజలి అరోరా ఒకరు. అప్పట్లో ఒక ట్రెండ్ సృష్టించిన పాట ‘కచ్చా బాదమ్’. ఓ వ్యక్తి తన పల్లీలు అమ్ముకునేందుకు స్వయంగా పాట రాసుకుని దానికి ట్యూన్ కట్టి దాన్ని రికార్డ్ చేసి.. దానిని ప్లే చేస్తూ ఊరూరు తిరిగి పల్లీలు అమ్ముకునేవాడు. ఓ వ్యక్తి ఇతని పాటను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది పెద్ద సెన్సేషనల్ అయిపోయింది. దీనికి ఎంతో మంది రీల్స్ చేసి అదరగొట్టారు. అయితే ఈ పాటపై అంజలి అరోరా అనే యువతి చేసిన రీల్ నెట్టింట్లో అందరికంటే ఎక్కువగా ఆకర్షించింది. దీంతో అంజలి ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయింది.
అంతేకాకుండా వివాదస్పద బ్యూటీ కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరించిన ‘లాకప్’ షోలో కూడా అంజలి పాల్గొని మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఈ షో తర్వాత మరింత పాపులారిటీ సంపాందించుకుంది అంజలి అరోరా. అయితే తాజాగా ఈమెకు సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
అంజలి అరోరా ఎమ్ఎమ్ఎస్ పేరిట ఒక ఫేక్ అసభ్యకర వీడియో నెట్టింట్లో లీక్ అయింది. అయితే దానిలో అంజలి ముఖం స్పష్టంగా కనిపించడం లేదు. అందులోనూ ఆమెతో సన్నిహితంగా మెలిగే వ్యక్తి ఆ వీడియోలో ఉండంటంతో అది నిజమైన వీడియోగానే అంతా భావిస్తున్నారు. అయితే ఆ వీడియో ఒరిజినల్ కాదని, అందులో ఏమాత్రం నిజం లేదని, అదొక ఫేక్ వీడియో అని అంజలి స్పష్టం చేస్తోంది.
Anjali Arora : ఆ వీడియోతో నాకు సంబంధం లేదు
అసలు ఆ వీడియోను ఎవరు క్రియేట్ చేశారు? ఎందుకు అలా చేశారో? తెలియడం లేదని అంజలి ఓ వీడియోలో కన్నీళ్లు పెట్టుకుంది. ”ఆ వీడియోలో ఉంది నేను కాదు. అసలు నాకు సంబంధం లేని వీడియోకు నా పేరును యాడ్ చేశారు. అసలు ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఆ వీడియోలో నా ఫొటో అతికించి, కావాలనే వైరల్ చేస్తున్నారు. నన్ను ఒకప్పుడు మెచ్చుకున్న ప్రేక్షుకులే ఇప్పుడు తిడుతున్నారు. నాకూ ఓ ఫ్యామిలీ ఉంది. మా ఇంట్లో వాళ్లు కూడా ఈ వీడియోలు చూస్తారని కనీసం ఆలోచించకుండా ఇలాంటివి చేయడం దారుణం. కేవలం యూట్యూబ్ వ్యూస్ కోసమే ఇలాంటివి చేస్తున్నారు. ఇలాంటి వాటిని తట్టుకునే శక్తి నాకు లేదు” అని ఎమోషనలై కన్నీరు పెట్టుకుంది అంజలి అరోరా.