Aamna Sharif : బాలీవుడ్ బ్యూటీ ఆమ్నా షరీఫ్ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. ఈ నటి తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లతో ప్రో వంటి ఫ్యాషన్ లక్ష్యాలను రోజూ అందిస్తూ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తుంటుంది. గౌన్ల నుండి టాప్స్ ,డెనిమ్ షార్ట్‌లలో ,క్యాజువల్ అవుట్‌ఫిట్స్ నుంచి ఎత్నిక్ వేర్ వరకు అన్నింటిని అకేషన్‌కు తగ్గట్లుగా ఈవెంట్‌కు సెట్ అయ్యేలా పార్టీలో ప్రత్యేకంగా కనిపించేలా ధిస్తూ అందరి చూపులను తనవైపుకు తిప్పుకుంటుంది.

తాజాగా ఈ చిన్నది సింపుల్ అవుట్ ఫిట్‌ను వేసుకుని చేసిన హాట్ ఫటో షూట్ పిక్స్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసి క్యాజువల్ లుక్స్ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అందిస్తోంది. ప్రస్తుతం నెట్టింట్లో ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

ఆమ్నా తన ఫోటో షూట్ కోసం ఫ్యాషన్ డిజైనర్ హౌస్ చిక్ లే ఫ్రిక్కి మ్యూజ్ గా వ్యవహరించింది. పాస్టెల్ గ్రీన్ గౌనును ఎంచుకుని తన అందాలను చూపిస్తూ అత్యద్భుతమైన యాంగిల్స్ లో ఫోటోలు దిగి కుర్రాళ్ళను మంత్రముగ్ధులను చేసింది. ఆమ్నా సాధారణ ఫ్యాషన్ డైరీలు సింపులుగా ఉన్నా అవి ఎందో అద్భుతంగా కనిపిస్తాయి అని అనడానికి ఈ పిక్స్ ప్రత్యేక ఉదాహరణగా నిలుస్తాయి.

డ్రమాటిక్ కట్-అవుట్ ఫుల్ స్లీవ్‌లు, డీప్ వీ నెక్లైన్, బ్యాక్ డీటైల్స్, తొడ ఎత్తైన చీలికతో డిజైన్ చేసిన పొడవాటి గౌనులో ఆమ్నా ఎంతో అందంగా కనిపించింది. ఈ గౌన్ లైట్ కలర్ లో ఉన్నా ఆమ్నా అందాలను హైలెట్ చేసింది. డీప్ నెక్లైన్ తన ఎద అందాలను చూపిస్తుంటే సైడ్ స్లిట్ తొడ సోయగాలను కనిపించేలా చేస్తూ కుర్రాళ్ళకు కునుకులేకుండా చేసింది.

ఆమ్నా ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా చెవులకు గోల్డెన్ హూప్ ఇయర్ రింగ్స్‌ను అలంకరించుకుంద. చేతి వేళ్ళకు ఉంగరాలు పెట్టుకుంది. పాదాలకు గోల్డెన్ కలర్ ఫుట్ వేర్‌ను ఎన్నకుంది. ఇక తన మెత్తటి కురులతో మధ్యపాపిట తీసి ఉంగరాల కర్ల్స్లో అట్రాక్టివ్ గా కనిపించేందుకు లూజ్‌గా వదులుకుంది. ఆమ్నా తన కనులకు న్యూడ్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, మస్కరా పెట్టుకుంది. పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్ దిద్దుకుని తన సింపుల్ మేకప్ లో ఎంతో గ్లామరస్‌గా కనిపించింది.

ఈ మధ్యనే ఆమ్నా మరో కాజ్యువల్ వేర్ వేసుకుని కత్తిలాంటి లుక్స్ తో అద్భుతమైన ఫోటో షూట్ చేసింది. ఈ ఆవుట్ఫిట్తోనూ ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది ఈ బ్యూటీ. స్వీట్హార్ట్ నెక్లైన్, స్లీవ్‌లెస్ వివరాలు, రంగురంగుల ప్యాట్రన్స్ తో వచ్చిన నీలిరంగు కత్తిరించిన టాప్‌ని ధరించి దానికి జోడీగా జత నీలిరంగు డిస్ట్రెస్డ్ డెనిమ్ షార్ట్ ను వేసుకుంది. ఈ పొట్టి డ్రెస్‌లో తన పిక్కల అందాలను చూపిస్తూ ఈ నటి ఆమె అభిమానులను ఉర్రూతలూగించింది.
