ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రముఖులు వరుసగా పెళ్లిల వైపు మనస్సు తిప్పుతున్నారు. ఒకప్పుడు పెళ్లిలు చేసుకోవడానికి అసలు ఆశక్తి అనేదే చూపించే వాళ్లు కాదు. కానీ ఇప్పుడు అదేదో క్యూ కట్టినట్టు ఒకరి తరువాత ఒకరు బాగా వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ పోతున్నారు. చాలా వరకు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఈ పెళ్లి బంధాన్ని నిలబెట్టుకోలేక పోతున్నారు . ఎందుకు అంటే ప్రేమించినంత కాలం వారి మధ్య ఎలాంటి గొడవలు లేకపోయినా అదేంటో పెళ్లి జరిగిన వెంటనే గొడవలు మొదలవుతుంటాయి.
ప్రముఖుల పెళ్లి విషయాలు తెగ వైరల్ అవుతాయి. ఎవరైనా కథానాయికలు పెళ్లి చేసుకుంటున్నారని తెలిస్తే.. వెంటనే విడాకులు ఎప్పుడూ అంటూ రచ్చ చేస్తుంటారు. ఇదంతా పక్కన పెడితే త్వరలో మరో కథానాయిక పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకు ఆమె ఎవ్వరో కాదు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి ఇద్దరమ్మాయిలతో,సరైనోడు వంటి సినిమాల్లో నటించింది కేథరిన్. ఈ ముద్దుగుమ్మ మొదటిసారిగా సినీ పరిశ్రమకలో కోలీవుడ్ పరిశ్రమకి పరిచయం కాగా ఆ తరువాత చమ్మక్ చల్లో మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతో కొంతవరకు సక్సెస్ అందుకుంది. పైసా,సరైనోడు, రుద్రమదేవి, ఇద్దరమ్మాయిలతో, గౌతమ్ నంద, నేనే రాజు నేనే మంత్రి, వరల్డ్ ఫేమస్ లవర్, మాచర్ల నియోజకవర్గం వంటి సినిమాల్లో నటించగా సరైనోడులో ఎమ్మెల్యే పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అంతగా అవకాశాలు లేకపోయే సరికి సినీ పరిశ్రమకి దూరంగా ఉంటూ.. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు నిత్యం ఫొటోలను షేర్ చేస్తూ ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది.
తను సినీ పరిశ్రమకి వచ్చిన కొత్తల్లో మంచి ఫిజిక్ తో ఉన్న ఈ భామ కాస్త బొద్దుగానే తయారైంది. అయినప్పటికీ గ్లామర్ షో ద్వారా అందాల విందు వడ్డిస్తుంటుంది. ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్న విషయం తెలిసిందే. గతంలోనే ఓ అగ్ర కథానాయకుని తో ప్రేమాయణం కొనసాగించిందని.. అతనికి బ్రేకప్ చెప్పిందని వార్తలు వినిపించాయి. త్వరలోనే ఈమె ఓ ఇంటికి కోడలు కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తన చిన్నప్పటి స్నేహితున్ని పెళ్లి చేసుకోబోతుందని.. కొంత కాలం నుంచి అతనితో ప్రేమలో ఉందని.. ఆ విషయం ఇంట్లో వాళ్లకి చెప్పడంతో వాళ్లు వెంటనే ఓకే అన్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో ఈ విషయం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. కొందరూ నెటిజన్స్ అయితే పెళ్లి సరే కానీ.. విడాకులు కూడా ఎప్పుడో చెప్పేస్తే ఓ పని అయిపోతుందని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ కథానాయిక పెళ్లి నిజమో కాదో తెలియాలంటే మాత్రం అధికారికంగా ప్రకటన రావాలంటే కొద్దీ కాలం వేచి ఉండవలసిందే మరి . .