Bigg Boss Promo: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో చూస్తుండగానే మరో వారం గడిచిపోయంది. శనివారానికి సంబంధించి స్టార్ మా య్యూటూబ్ లో ప్రోమో రిలీజ్ అయింది. ముందుగా ఓ మాస్ సాంగ్ తో ఎంట్రీ ఇవ్వడాన్ని చూపిస్తారు. ఏంటి ఈ వారం బిగ్ బాస్ బాగా కోపం పడినట్లు ఉన్నారని నాగార్జున్ అంటారు. దీంతో వెంటనే శ్రీహాన్ లేచి వినోదానికి సంబంధించిన టాస్క్ లో కాస్త ప్రదర్శన తగ్గిందని చెప్పబోతాడు. కొంచెమా అని నాగ్ అంటాడు. అంటే కొంత మందివి కొంచెం తగ్గింది. మరికొంత మందివి బాగా తగ్గిందని శ్రీహాన్ చెప్తాడు.
అంటే ఇంతకు ముందు ఇవే… అని రేవంత్ ఏదో చెప్పబోతాడు… దీంతో పప్పు… పప్పు…నీవు కూర్చో అని రేవంత్ ని ఉద్దేశించి అంటాడు నాగార్జున. తర్వాత శ్రీహాన్ కు నాగార్జున పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తాడు. నీకోసం స్పెషల్ గా కేకు…నీ కోసం స్పెషల్ గా హార్టు… ఆ కేకు మీద చోటు అని రాసే చోటు హృదయం ఉందని నాగ్ అంటారు. ఏదైనా తేడా వస్తే కెమెరాలో నుండి చీపుర్లు, చెప్పులు అన్ని వచ్చేస్తాయి సార్ రెండు చేతులు జోడించి అంటాడు శ్రీహాన్.
ఈ క్రమంలో మరోసారి రేవంత్ మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తాడు.. మరలా పప్పు..పప్పు.. నీవు సైలెంట్ గా ఉండు.. నేను నిన్ను అడగలేదు అని నాగ్ అంటారు. పప్పు విషయంలో తప్పు ఎవరిది అని శ్రీసత్యను నాగ్ అడుగుతారు. నలుగురు ఫ్రెండ్స్ ఉన్నపుడు ఏమనుకున్నా సరిపోతుంది.. కానీ గేమ్ జరుగుతున్నప్పుడు నీవు ఉండరా పప్పు అని అనడం తప్పు అన్నట్లు శ్రీసత్య చెప్తుంది. రేవంత్ నీవు చేసింది తప్పా.. ఒప్పా… చెప్పు పప్పు అని నాగ్ అంటారు.
ఇన్ని వారాల్లో లేనిది అప్పుడెప్పుడు చెప్పనిది ఇప్పుడు పక్కవాళ్లు చెప్పిన వెంటనే అని రేవంత్ వివరణ ఇవ్వబోతే అర్జున్ లేదు సార్ ఇంతక ముందు కూడా చాలా సార్లు అన్నాడు చెప్పాను అని చెప్పబోతాడు… నేను మాట్లాడిన తర్వాత చెప్పు అని రేవంత్ అంటాడు. తర్వాత ఫైమా సంచాలకురాలిగా ఎలా చేసిందని మీ ఉద్దేశ్యం అని నాగ్ అడుగుతాడు. బాగా చేసింది సార్ అని దాదాపు ఎక్కువ మంది అంటారు. రాజ్ నేను అక్కడ అర్గ్యూమెంట్ చేశాను అని రాజ్ ఏదో చెప్పబోతుంటే రాజ్… ఇక చాలు అని అంటారు. తర్వాత చిట్టీలో నుండి నామినేషన్ పర్సన్ ని ఎంచుకోవడం విషయంపై నాగార్జున డిష్కషన్ చేశాడు. చిట్టీలు వస్తే మీరు క్లాస్ పీకుతారేమో అని మరలా ఓటింగ్ కు వెళ్లామని సత్య చెప్తుంది. అంటే నా మీద తోసేశారన్న మాట అని నాగ్ అంటారు. దీంతో ప్రోమో ముగుస్తుంది.